Y.S.R. Cuddapah

News October 18, 2024

సిబ్బంది సంక్షేమమే పరమావధి: కడప ఎస్పీ

image

కడప జిల్లాలోని పోలీస్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకుని రావాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. గార్డు విధుల్లోని ఏఆర్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా.. జిల్లా ఎస్పీ నేడు వారికి సీలింగ్ ఫ్యాన్లు, బెడ్స్, వాటర్ డిస్పెన్సర్లు వంటి పరికరాలను అందించారు.

News October 18, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్ష కేంద్రాలు ఇవే..!

image

☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT చాపాడు

News October 18, 2024

కడప: అతని కోసం డ్రోన్‌తో వెతుకులాట

image

కడప జిల్లా బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన మోకల కాపరి గంగిరెడ్డి గత 4 రోజులుగా కనిపించడంలేదు. దీంతో చివరికి డ్రోన్‌లను రంగంలోకి దించి అతని జాడకోసం వెతుకుతున్నారు. మరో వైపు గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. కాగా గొర్రెల కాపరి గంగిరెడ్డి 4 రోజుల క్రితం అడవికి మేకలను తోలుకుని వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో గ్రామస్థుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News October 17, 2024

జాతీయ విద్యా విధానం – 2020కి అనుగుణంగా ఉల్లాస్ కార్యక్రమం

image

జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాయచోటి కలెక్టరేట్‌లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాను 100% అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చడమే ధ్యేయమని ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

News October 17, 2024

కడప జిల్లాలో 635 ఎకరాల్లో ఉల్లి పంట నష్టం

image

జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 635 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముద్దనూరు, తొండూరు, దువ్వూరు, యర్రగుంట్ల, వీయన్ పల్లి, వేంపల్లి మండలాల్లోని 828 మంది రైతులకు చెందిన 635.20 ఎకరాల్లోని ఉల్లి పంట వర్షాలకు దెబ్బతింది. సుమారు రూ. కోటి 59 లక్షలు ఇన్ ఫుట్ సబ్సిడీ అవసరమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

News October 17, 2024

కడప జిల్లాకు అదొక పీడకల

image

కడప నగర ప్రజలకు 2001 అక్టోబర్‌లో వచ్చిన వరదలు ఓ పీడకలను మిగిలిచ్చింది. కడప బుగ్గ వంకకు భారీగా వరద రావడంతో కడప నగరాన్ని చుట్టుముట్టింది. తెల్లవారు జామున నిద్రలేచి తేరుకునేలోపు పలువురు శవాలుగా మారారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లల్ని భుజాన వేసుకొని రోడ్ల మీద పరుగులు తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూస్తుంటే అక్కడి ప్రజలు ఆ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.

News October 17, 2024

కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదితి సింగ్

image

కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గాజాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాడర్ ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ లోతేటి శివశంకర్ రిపోర్ట్ చేయడంతో జిల్లాలో కలెక్టర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. కొత్త కలెక్టర్‌ను నియమించేంత వరకూ జేసీనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

News October 17, 2024

కడప: ఈనెల 17 నుంచి నేరుగా ప్రవేశాలు

image

యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సులలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు నేరుగా అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల డైరెక్టర్(డీవోఏ) డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలు, నిర్ణీత ఫీజుతో వైవీయూలోని డీవోఏ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు yvu.edu.in అనే వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు.

News October 16, 2024

కడప జిల్లాలో రేపు కూడా సెలవు

image

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్, కాలేజీలు, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలు పరచాలని ఆదేశించారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 16, 2024

అన్నమయ్య జిల్లాలో రేపు కూడా సెలవు

image

అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు.
NOTE: రేపటి సెలవుపై కడప జిల్లా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.