Y.S.R. Cuddapah

News May 3, 2024

దువ్వూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.

News May 3, 2024

TDPలోకి బద్వేలు మాజీ ఎమ్మెల్యే?

image

బద్వేలులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ MLA కమలమ్మ తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప పర్యటనలో ఉన్న చంద్రబాబును గురువారం ఆమె కలిశారు. మరి కొద్దిరోజుల్లో టీడీపీ కండువా కప్పుకుంటారని ఆమె వర్గీయులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతోనే కమలమ్మ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

News May 3, 2024

ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయం మీటింగ్ హాలులో నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.

News May 2, 2024

చాపాడు: ‘వైసీపీ కార్యకర్త కాలు విరిచిన TDP నాయకులు’  

image

మైదుకూరులో నిన్న సీఎం జగన్ సిద్ధం సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్లాడే కారణంతో ఖాదరపల్లెకు చెందిన యాపరాలపల్లె జాఫర్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు వివరాల మేరకు జాఫర్ మంగళవారం సీఎం జగన్ సభకు హాజరయ్యారు. దీంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ వ్యక్తులు ఫకృద్దిన్, లాల్ బాషాలు మెడపై కత్తి ఉంచి సభకు ఎందుకు వెళ్లావని బెదిరించి కాలు విరిచారని తెలిపారు.

News May 2, 2024

వల్లూరు: చెరువులో బాలుడి మృతదేహం

image

వల్లూరు మండలంలోని గోటూరు గ్రామ పరిధి చెరువులో గుర్తు తెలియని బాలుడి మృతదేహం పడి ఉంది. గురువారం తెల్లవారు జామున బాలుడి మృతదేహాన్ని స్థానికులకు చెరువు నీటిలో నిర్జీవంగా తేలియాడుతూ కనిపించింది. బాలుడి మృతదేహాన్ని బట్టి చూస్తే వయసు ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

కడప: పింఛను డబ్బు కోసం వెళ్లి వృద్ధుడు మృతి

image

పింఛను డబ్బు కోసం వెళ్లి వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన రాయచోటిలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు రాయచోటిలోని ఓ బ్యాంకుకు పింఛన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లారు. ఎండకు వెళ్లడంతో వడదెబ్బతో వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News May 2, 2024

ఎవరి హయాంలో కడప అభివృద్ధి..?

image

2024 ఎన్నికల నేపథ్యంలో కడప అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కడప జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని కూటమి అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో జిల్లాకు రెండు కంపెనీలు, కడపలో సర్కిల్స్, ఒక మెడికల్ కాలేజ్, ఇలా కడప జిల్లా ముఖచిత్రాన్ని మార్చామంటూ YCP అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో కడప అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News May 2, 2024

అన్నమయ్య జిల్లాకు ప్రధాని మోదీ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొననున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే పీలేరు కూటమి అభ్యర్థిగా కిరణ్ తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి బరిలో ఉండటంతో పీలేరులో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

News May 2, 2024

బద్వేల్ ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు: షర్మిల

image

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధాపై వైఎస్ షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బద్వేల్ ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు కదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుండంటా.. కొండలు, గుట్టలు ఏదీ వదిలిపెట్టడం లేదంటకదా’ అని విమర్శనాస్త్రాలు గుప్పించారు. షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం.

News May 2, 2024

కడపలో చంద్రబాబు.. జమ్మలమడుగులో షర్మిల

image

కడప జిల్లాలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి ఉండనుంది. కడప, రాయచోటిలో TDP అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తుండగా.. ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల జమ్మలమడుగులో పర్యటించనున్నారు. ఇద్దరు కూడా కడప జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇవాళ వీరిద్దరూ కడప జిల్లాకు ఎటువంటి హామీలు ఇస్తారు. అదే విధంగా వీరిద్దరూ పర్యటించిన ప్రతి చోట ఆనియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు.