Y.S.R. Cuddapah

News June 30, 2024

కడప: YSRTUC జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన రసూల్ బాషా

image

YSRTUC ట్రేడ్ యూనియన్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కడప రసూల్ బాషా తెలిపారు. వైసీపీలో తాను గత 13 సంవత్సరాలుగా ఉన్నానని, సొంత కారణాలవల్ల YSRCP నుంచి వైదొలుగుతున్నట్లు ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, మరో పార్టీ నుంచి ఒత్తిడి గాని లేదని ఆయన ప్రకటించారు. ఇక పార్టీ కార్యక్రమాలు తాను చేయదలచుకోలేదని తెలిపారు.

News June 30, 2024

బతికున్నంత కాలం నిజాయితీగానే బతుకుతా: MLA వరద

image

తాను బతికున్నంత కాలం నిజాయితీగా బతికి చనిపోతానని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు గీతాశ్రమంలో విశ్వహిందూ పరిషత్, ABVP, RSS, శివ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అభినందన సభ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తామన్నారు. దేవాలయాల ఆస్తులను కాపాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు రాజీ పడకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 30, 2024

సిద్దవటం: ‘కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త అవాస్తవం’

image

సిద్దవటం మండలం వెలుగు పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతున్నట్లు కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త కథలు అవాస్తవమని సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి అన్నారు. ప్రతిరోజు మా సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా అన్నీ గమనిస్తున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. చిరుత తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కళావతి అన్నారు.

News June 30, 2024

మొదలైన చంద్రబాబు మోసాలు: మాజీ MLA రాచమల్లు

image

డీఎస్సీ నోటిఫికేషన్, పింఛన్ల పంపిణీతో సీఎం చంద్రబాబు మోసాలు మొదలయ్యాయని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. 50 వేల టీచర్ పోస్టులకు కేవలం 16 వేల పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. దివ్యాంగులకు పెంచిన పింఛన్ 3 నెలలకు కలిపి ఇవ్వకుండా వారిని మోసం చేస్తున్నారన్నారు. ప్రజల తరఫున తాము శాంతియుత పోరాటం చేస్తామన్నారు.

News June 30, 2024

కడప: ITIలలో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2వ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ మైనాటీల ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.జ్ఞానకుమార్ తెలిపారు. విద్యార్థులు 10వ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు కూడా అడ్మిషన్లను పొందవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ అప్లికేషను ఆన్లైన్ ద్వారా iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.

News June 30, 2024

కడప: ‘సహజీవనం చేసి.. పట్టించుకోలేదు’

image

రాజంపేట అదనపు DMHO చెన్నకృష్ణ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ముఖం చాటేశాడని ఓ స్టాఫ్ నర్సు ఆరోపించారు. కమలాపురం ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో చెన్నకృష్ణ పరిచయమయ్యాడని, తనను రెండో భార్యగా చేసుకుంటానని నమ్మించాడన్నారు. 2013లో పెళ్లి చేసుకుని, కడపలో కాపురముండేవాళ్లమని, 5 నెలలుగా పట్టించుకోలేదని తనకు న్యాయం చేయాలన్నారు. దీనిపై చెన్నకృష్ణ స్పందిస్తూ ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

News June 30, 2024

కడప: తండ్రీ కొడుకులపై అల్లుడు దాడి

image

కడప నగరంలోని శారదా నిలయం సమీపంలో శుక్రవారం రాత్రి నబీ రసూల్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నబీ రసూల్ మామ చాన్, అతని కుమారుడు జంక్సాన్ వలి ఎందుకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో నబీ రసూల్ వారిపై కత్తితో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 30, 2024

అతిసార వ్యాధి నిర్మూలనకు నీటి సరఫరా కీలకం: JC

image

అతిసార వ్యాధి నిర్మూలనకు పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరాలే కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం అతిసార వ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమం- 2024 పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసిడిఎస్, మునిసిపల్ అధికారులు ఉన్నారు.

News June 29, 2024

యోగివేమన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

YVU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ రాజీనామాకు VC ఆమోదం తెలిపారు. అనంతరం YVU వీసీ ఆచార్య సుధాకర్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి పంపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా YVU ప్రిన్సిపల్ రఘునాథరెడ్డికి వారు నియామక పత్రం అందజేశారు.

News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.