India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి మండిపల్లి నేడు ఇసుక తవ్వకాల కేంద్రాలను ప్రారంభించనున్నారు. చెయ్యేరు నదీ తీరంలో బుడుగుంటపల్లి వద్ద 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె వాసులు పేర్లు నమోదుకు సానిపాయి సచివాలయం, రాజంపేట, రైల్వేకోడూరు వాసులకు కూచివారిపల్లి సచివాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టన్ను ఇసుకకు రూ. 328 చెల్లించాలన్నారు.
వెలిగల్లు జలాశయంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించామని ప్రాజెక్టు డీఈఈ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఈ ప్రాజెక్టు ద్వారా లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, రాయచోటి మండలాలకు సాగు, తాగు నీటిని అందించాల్సి ఉంది. నిమజ్జనం చేస్తే విగ్రహాలకు వినియోగించే రంగులు, రసాయనిక పదార్థాలతో నీటి కాలుష్యం జరుగుతుంది. జల కాలుష్య నివారణలో భాగంగా ప్రాజెక్టులో నిమజ్జనాన్ని నిషేధించాం’ అని డీఈఈ తెలిపారు.
సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయడం వల్ల గొప్ప మార్పులు సాధించవచ్చని ఆయన ప్రజలను కోరారు. చెరువులు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దామని, మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు.
కడప జిల్లాలో గంజాయి నిర్మూలనకు విస్తృతంగా దాడులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. జిల్లాలో గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిఎన్సీసీ (డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్) టీంతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి జిల్లాలోకి రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వేంపల్లెకు చెందిన కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఆకుపచ్చ ముగ్గు’ కథను ఏపీ ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై B.A, B.Com, B.Sc, B.B.A చదువుతున్న విద్యార్థులు 3వ సెమిస్టర్ కింద చదువుకోవాల్సిన పాఠ్యాంశాల్లో వేంపల్లె షరీఫ్ కథ కూడా ఉంటుంది.
వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గణేష్ నిమజ్జనం చేసే పాత కడప చెరువును భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పరిశీలించారు. విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబంధించిన డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.
వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్ జైళ్లను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఖైదీలతో మాట్లాడి కేసు పూర్వపరాలు, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిసరాలు, వంట గదులను పరిశీలించి పలు సిబ్బందికి సూచనలిచ్చారు.
వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్ జైళ్లను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఖైదీలతో మాట్లాడి కేసు పూర్వపరాలు, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిసరాలు, వంట గదులను పరిశీలించి పలు సిబ్బందికి సూచనలిచ్చారు.
కడప జిల్లా చాపాడు మండల పరిధిలోని అల్లాడుపల్లె గ్రామ సేవకుడు కుచ్చుపాప రవి(55) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. బుడిదపాడు గ్రామ VRAగా పని చేస్తున్న రవి గురువారం పొలం వద్ద వరి సాగు పని చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆర్ట్ మాస్టర్ డి ఆనంద్ రాజు, తన రక్తంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వి.వి వరప్రసాద్ సిబ్బంది కలసి ఆర్ట్ మాస్టర్ ఆనంద్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.