Y.S.R. Cuddapah

News June 28, 2024

కడప: ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

బి.కోడూరు మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన మున్నెల్లి అనూష గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోరుమామిళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె వేసవి సెలవుల్లో వనిపెంటలోని పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

News June 28, 2024

కడప: పెన్షన్ల పంపిణీ పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో జులై 1, 2 తేదీల్లో చేపట్టనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, డిఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, జిఎస్ డబ్ల్యుఓ ఏవో లక్ష్మీపతి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News June 27, 2024

కడప: 29 న జాతీయ మెగా లోక్ అదాలత్

image

జిల్లావ్యాప్తంగా ఈనెల 29న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జస్టిస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు జస్టిస్ శ్రీదేవి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 27, 2024

సుండుపల్లె: పింఛానదిలో పడి బాలుడి మృతి

image

సుండుపల్లె  పింఛా ప్రాజెక్టు నదిలో ప్రమాదవశాత్తూ పడి యశ్వంత్ నాయక్(15)విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు పింఛాకు చెందిన మునె నాయక్ కుమారుడు యశ్వంత్ బుధవారం పింఛానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి మృతి చెందాడు. పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News June 27, 2024

AP- IIITలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.

News June 27, 2024

కడప: సంపూర్ణత అభయాన్ పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సంస్థ ఆదేశాల మేరకు జూలై 4న జిల్లాలో సంపూర్ణత అభయాన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమం అమలు, సాధించాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News June 27, 2024

వీరబల్లి: విషం పెట్టి వృద్ధ దంపతులను చంపేశారు

image

వీరబల్లి మండల కొత్తవడ్డెపల్లిలో ఇంట్లో ఉండొద్దని కోడలు అత్తమామలకు విషం పెట్టి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్న(80), నాగమ్మ(70) చంపేందుకు అన్నంలో విషం కలిపారు. అది తిన్న దంపతులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 27, 2024

రాయచోటి: ప్రజాధనం దుర్వినియోగం చేశారు: రాంప్రసాద్ రెడ్డి

image

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ఏదో జిల్లాలు అభివృద్ధి పథంలో నడిపేందుకు అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసి పెద్ద పెద్ద కార్యాలయాల భవనాలు కడతారని అనుకోలేదనీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి రాయచోటిలోని వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

News June 27, 2024

ప్రొద్దుటూరులో దారుణ హత్య.. 3 ముక్కలు చేసి..

image

ప్రొద్దుటూరులో మహేశ్వర్‌రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో ముద్దాయి రామచంద్రారెడ్డిని గురువారం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు లోనైన మృతుడు మహేశ్వర్‌రెడ్డి తనను ఎక్కడ చంపుతాడో ననే భయంతో అతన్ని రామచంద్రారెడ్డి హత్య చేసినట్లు డీఎస్పీ మురళీధర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. మహేశ్వర్‌‌రెడ్డి మృతదేహాన్ని హంతకుడు అత్యంత కర్కశంగా మూడు ముక్కలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News June 27, 2024

‘కౌన్సిల్ ఆమోదం లేకుండా పేరు మార్చడం పద్దతి కాదు’

image

పులివెందుల కూరగాయల మార్కెట్‌కు మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం లేకుండా కూటమి నాయకులు పేరు మార్చడం సరైన పద్ధతి కాదని మున్సిపల్ ఛైర్మెన్ వరప్రసాద్, వైస్ చైర్మెన్ వైఎస్ మనోహర్ రెడ్డి లు అన్నారు. బుధవారం ఆయన ఇంటి వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూరగాయల మార్కెట్‌ను గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అప్పట్లో ఉన్న వ్యాపారులు, ప్రజలు మార్కెట‌కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారన్నారు.