Y.S.R. Cuddapah

News June 25, 2024

కడప: అప్లై చేశారా.. నేడే తుది గడువు..!

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్‌ సైట్‌లో విడుదల చేయనున్నారు.

News June 24, 2024

కడప: అప్లై చేశారా.. ఇక ఒక్కరోజే గడువు..!

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్‌సైట్ విడుదల చేయనున్నారు.

News June 24, 2024

ప్రొద్దుటూరు: యువతి హత్య కేసులో నిందితుడికి శిక్ష

image

ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో దాదాపు 7ఏళ్ల క్రితం హైందవి(21) అనే యువతి దారుణ హత్య కేసులో నిందితుడు నవీన్ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 వేలు జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సెకండ్ ఏ.డీ.జె కోర్టు జడ్జి శ్రీ జి.ఎస్ రమేష్ కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు. కేసును సరైనా సమయంలో సాక్షులను కోర్టు హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా చేసిన కోర్ట్ మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News June 24, 2024

కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. కాశినాయన మండల పరిధిలో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బద్వేలు మండలంలో 1.6 మి.మీ., రాజుపాలెం మండల పరిధిలో 1.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 0.3 గా నమోదయింది.

News June 24, 2024

ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య

image

ప్రొద్దుటూరులోని YMR కాలనీలోని మాజీ MLA ఇంటి ఎదురుగా దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన వెంకట మహేశ్వర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇతడిని ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా శుక్రవారం అర్షత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

News June 24, 2024

మైపాడు బీచ్‌లో కడప యువకుడు మృతి

image

కడపకు చెందిన యువకుడు ఇమ్రాన్ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కడపలోని ఆటో మెకానిక్ యూసుఫ్ కుమారుడైన ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఆటవిడుపు కోసం ఓ వాహనంలో ఆదివారం మైపాడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా సముద్రంలో గడుపుతుండగా పెద్ద అల ఇమ్రాన్‌ను తీసుకెళ్లింది. స్థానికుల సహకారంతో ఇమ్రాన్ మృతదేహాన్ని వెలికితీసి కడపకు తీసుకువచ్చారు.

News June 24, 2024

కడప: నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మూడవరోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తలతో ఆయన మమేకమవుతారు. మధ్యాహ్నం నుంచి ఆయన సతీమణి భారతితో రోడ్డు మార్గన బెంగళూరు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గత రెండ్రోజులుగా జగన్‌ను కలిసేందుకు వస్తున్న వైసీపీ కార్యకర్తలు, శ్రేణులను ఆయన ఆత్మీయంగా పలకరిస్తున్నారు.

News June 24, 2024

వేంపల్లి: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం

image

వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ ఎద్దుల రాజీవ్ ప్రసాద్ మృతి చెందాడు. వేంపల్లిలో నివాసం ఉంటున్న రాజీవ్ ప్రసాద్ ఆదివారం యథావిధిగా ద్విచక్ర వాహనంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా వైయస్సార్ ఘాట్ సమీపంలో అదుపుతప్పి గోతిలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 24, 2024

ఆ బాధ నాకు తెలుసు: మంత్రి మండిపల్లి

image

రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ.. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవాడు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు. జగన్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదన్నారు. రెండు నెలల్లో రోడ్ల బాగుపై దృష్టిపెడతామన్నారు.

News June 23, 2024

30న కడప జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు

image

కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అండర్ -19 జూనియర్ విభాగం, సీనియర్ విభాగంలో పురుషులు, మహిళల విభాగం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విడివిడిగా ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.