India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప పట్టణానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని ఉత్తమ సోషల్ మీడియా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల మీద సామాజిక మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. అనంతరం కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.

కడప జిల్లాలోని కడప, పులివెందుల, బద్వేల్ ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఉన్నతధికారులు ఆదేశాలు జారీ చేశారు. కడప ఆర్డీవోగా జాన్ పలపర్తిని, జమ్మలమడుగు ఆర్డీవోగా ఆదిమూలం సాయి శ్రీ, బద్వేలు ఆర్డీవోగా చంద్రమోహన్‌ను, పులివెందుల ఆర్డీవోగా లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూషను నియమిస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటుపలువురు డిప్యూటీ కలెక్టర్లను జిల్లాలో బదిలీ చేశారు.

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో లాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

ప్రఖ్యాత గండికోట వేదికగా రేపు జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే వేడుకలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొంటారని జిల్లాలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ప్రజల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలకు సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 342 టీచింగ్, 44 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, టైప్ 4 కేజీబీవీల్లో 165 టీచింగ్, 53 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలిపారు. గురువారం ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపునకు అవకాశం కల్పించారు. వివరాలకు apkgbv.apcfss.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

జిల్లాలో జూదం ఆడుతూ 13 మంది బుధవారం అరెస్టయ్యారు. ఎర్రగుంట్లలోని ఎరుకల కాలనీలో 8, సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లెలో <<14196593>>ఐదుగురి<<>>ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ.28,530 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనులు ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారు.

కడప జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల్లోని మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.