India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లా వ్యాప్తంగా 252 మంది వీఆర్వోలను బదిలీ చేసినట్లు కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను, వార్డు రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేసినట్లు తెలిపారు. వీఆర్వోలకు కేటాయించిన స్థానాలలో చేరాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శక విధానంతో జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌కు వివరించారు. ఉచిత ఇసుక సరఫరా అంశంపై కలెక్టర్లతో గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ రవాణాదారులు మధ్య సేవాస్థాయి ఒప్పందం అంశాలపై వివరించారు.

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం రాజగోపాల్ రెడ్డి అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని శ్రీరాములు పేటకు చెందిన వ్యక్తిగా ఇతనిని గుర్తించారు. మృతుడు ప్రొద్దుటూరు శ్రీరామ్ ఫైనాన్స్‌లో రికవరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతికి గల వివరాలు తెలియాల్సిఉంది.

కడప నగరంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన యువకులపై<<14190089>> జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీవ్రంగా స్పందించారు.<<>> యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కడప నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఇద్దరు యువకులను కడప రిమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలపై ఉపేక్షించేది లేదన్నారు.

ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా ఇచ్చిన పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఈయన కోడూరు నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మంగారిమఠం సోమిరెడ్డి పల్లె వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని రహదారులు బురదమయంగా మారాయి. బ్రహ్మంగారిమఠం బద్వేల్ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న 15 మందిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ సురేశ్ అటవీశాఖ అధికారులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో వీరు పట్టుబడ్డారు.

కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ లోతేటి శివశంకర్ ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులను విడుదల చేశారు. బదిలీలు అయిన డిప్యూటీ తహశీల్దార్లు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతంలో విధులలో చేరాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 59 మందిని మార్పు చేశారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రామక్కపల్లి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే.. బైక్‌ను టాటా మ్యాజిక్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి <<14186271>>మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా<<>> ఉంది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పుల్లంపేట మండలం రెడ్డిపల్లెకు చెందిన గన్నేరు చంటి (32)గా గుర్తించారు.

వల్లూరు మండలంలో మంగళవారం <<14185933>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వల్లూరు మండలం ఈతచెట్టు వద్ద లారీ పల్సర్ బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు జరిగాళ్ల బాబు (కట్ట) గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.