India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కమలాపురం మండలం పందిళ్ళపల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్దన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ జడ్జి GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్ధన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీని ప్రారంభించింది. ఇవాళ 20 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో కడప జిల్లా నేతలకు చోటు దక్కలేదు. నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్న జిల్లా నేతలకు నిరాశే ఎదురైంది. బీటెక్ రవి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూపేశ్ రెడ్డి, బత్యాల చెంగల్ రాయుడు వంటి వారు పదవులు ఆశిస్తుండగా రెండో జాబితాలో జిల్లా నేతలకు చోటు దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

కడప జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడారు. మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు నిమ్మకాయ సుధాకర్ రెడ్డి, ఆయన సతీమణి వీరపునాయునిపల్లె జడ్పీటీసీ నిమ్మకాయల రాజేశ్వరమ్మ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక, అసంతృప్తితో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

మాజీ డిప్యూటీ సీఎం, కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప తాలూకా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిలో తాలూకా పరిధిలో ఓ స్థల విషయంలో జరిగిన గొడవకు సంబంధించి విచారణ కోసం పోలీసులు పిలిపించారు. అయితే విచారణకు సమయం పడుతుందన్న కారణంగా ఆయనను వెనక్కు పంపారు. తిరిగి విచారణకు పిలిచినప్పుడు రావాలని అతనికి సూచించారు.

రాయచోటి మండల పరిధిలోని గొర్లముదివేడుకు చెందిన గౌనిపల్లి మల్లయ్య(55) రాళ్లను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే గుట్ట వద్ద రాళ్లు కొడుతూ మట్టి తవ్వుతున్న క్రమంలో పెద్ద బండరాయి వచ్చి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసువారు అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఉచిత సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో జరుగుతున్న దొంగతనాల నివారణకు ఎల్.హెచ్.ఎం.ఎస్ సిస్టమ్‌ను మీ ఇంటి నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు మొబైల్ యాప్ ద్వారా పోలీసులకు తెలపాలన్నారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం పలు విషయాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా.. కడపలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌస్ నిర్మాణం గురించి అధికారులను అడిగారు. 80% పూర్తయిందని తెలుపగా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదివరకు ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.