India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ పార్క్ సమీపంలో ఓ యువకుడు, మరో యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ సి.భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన యువకుడిని రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.
వర్షాల కారణంగా టమాట పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు టమాటాలను దిగుమతి చేయట్లేదు. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ పుంగనూరు నుంచి టమాటాలను కొనుగోలు చేసి కడప రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అమ్మకాలు చేపట్టింది. వినియోగదారులకు కిలో రూ.60 విక్రయిస్తున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది.
ఆదినిమ్మాయిపల్లె ఆనకట్ట వద్ద జరిగిన రూ.600 కోట్ల ఇసుక కుంభకోణంపై విచారణకు ఆదేశిస్తూ ఆర్డీఓ మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం రవిశంకర్ రెడ్డి నాయకత్వాన 2019 నుంచి 24 వరకు జరిగిన కుంభకోణం మీద వినతిపత్రం ఇచ్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ విచారణ చేయాలని ఆర్డీవో ఆదేశించారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. రైల్వే సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కడప – కనుమలోపల్లి మార్గమధ్యంలో ఓ మహిళ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి రావడంతో అదే మార్గంలో వెళ్తున్న గూడ్స్ ఢీకొని మృతి చెందినట్లు రైల్వే సీఐ నాగార్జున తెలిపారు. ఫోటోలో కనబడుతున్న మహిళ మృతదేహం ఆనవాళ్లను ఎవరైనా గుర్తించినట్లయితే కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు.
యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని TNSF నేతలు తప్పుబట్టారు. ఇందులో భాగంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ YVU వీసీ ప్రొఫెసర్ చింత సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.
కడప జిల్లాలో అద్దె ఆర్టీసీ బస్సులతో తరచూ ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 16వ తేదీన కడప శివారులో స్కూటీని ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరుసటి రోజే కడప డిపోకు చెందిన అద్దె ఆర్టీసీ, కారును ఢీకొనగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుంచి జూన్17 వరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వగా …ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.
కడప జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 మంది ఎస్సైలు, నలుగురు సీఐలకు స్థానచలనం కల్పించారు. కడప 1 టౌన్ సీఐగా రామకృష్ణ, కాజీపేట సీఐగా ప్రొద్దుటూరు రూరల్ సీఐ రమణారెడ్డిని నియమించారు. ప్రస్తుత1 టౌన్ సీఐ, కాజీపేట సీఐలను కర్నూలు వీఆర్ఓ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
కడప నగరంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన వారి నుంచి డబ్బులను తీసుకుని సిబ్బందికి పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ‘కరపత్రాలు’ ముద్రించి రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటన పోలీసు అధికారుల్లో అసహనం, ప్రజల్లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఎవరు కరపత్రాలను తయారు చేశారు? ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
కడప నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఆర్టీసీ పాత అసుపత్రి ఆవరణంలో డిసెంబర్ 30న హెల్పర్ ప్రసాద్‌పై, రవి కుమార్, కిషోర్‌కుమార్, మరో 5మందితో కలిసి దాడి చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అరెస్టయిన వారిలో రవికుమార్, ప్రశాంత్, మునీంద్ర ఉన్నారు. ఈ ప్లేస్‌లో మరి కొంతమంది పరార్‌లో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.