India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఆర్టీసీ పాత అసుపత్రి ఆవరణంలో డిసెంబర్ 30న హెల్పర్ ప్రసాద్‌పై, రవి కుమార్, కిషోర్‌కుమార్, మరో 5మందితో కలిసి దాడి చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అరెస్టయిన వారిలో రవికుమార్, ప్రశాంత్, మునీంద్ర ఉన్నారు. ఈ ప్లేస్‌లో మరి కొంతమంది పరార్‌లో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలని సీఎం రమేశ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి మంగళవారం వినతి పత్రం అందించారు. ఉడాన్ పథకంతో దేశీయ ట్రూజెట్ సంస్థ 2018లో కడప నుంచి నాలుగు ప్రాంతాలకు రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ప్రారంభిస్తే, వైసీపీ వీజీఎఫ్ చెల్లించక సర్వీసులు నిలిపివేసిందని ఆరోపించారు. కడప-ముంబయి, కడప- హైదరాబాద్ విమానాలను రెగ్యులర్‌గా నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.
జమ్మలమడుగు మున్సిపాలిటీలో 3 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఛైర్‌పర్సన్ శివమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు ఎంత మేర వస్తున్నాయి, ఎంత ఖర్చు చేశారన్న విషయాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లె గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం రైతు జనార్ధన్(51) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మాజీ సీఎం జగన్ బుధవారం పులివెందుల పర్యటనకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
నిడిజివ్వి గ్రామంలో జూదం ఆడుతున్న 16 మందిని ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 72,750 నగదును స్వాధీనం చేసుకునట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. అదే విధంగా పోట్లదుర్తి గ్రామంలో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.24,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కడపలో సోమవారం తొలిసారిగా MLAలు సోమవారం సమావేశమయ్యారు. అక్రమార్కుల పనిపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో అంటకాగిన అధికారుల భరతం పట్టాలని, దీనిలో ఎలాంటి మినహాయింపులు లేవనే అభిప్రాయానికి వచ్చారు. జిల్లా TDP శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన R&Bలో చర్చించారు. దీనికి కమలాపురం MLA పుత్తా హాజరుకాలేదు. అయిదేళ్లు కార్యకర్తలను వేధించిన వారిని గుర్తించి తీవ్రవను బట్టి సస్పండ్ చేయించాలని అభిప్రాయానికి వచ్చారు.
Sorry, no posts matched your criteria.