India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముడమాల బాలముని రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్‌కు, మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి రావడంతో తమ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
కడప – మైదుకూరు జాతీయ రహదారిలో మైదుకూరుకు చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటలకు బైకుపై కడప నుంచి మైదుకూరు వెళ్ళే మార్గంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారని తెలిపారు.
పులివెందుల నివాసి యశ్య అనే యువకుడు ఆదివారం సాయంత్రం బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కిందపడి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సీటీ స్కాన్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పులివెందుల నివాసిగా గుర్తించారు.
పులివెందుల పట్టణ పరిధిలో జగనన్న గృహ నిర్మాణ పథకం కింద దాదాపు 8 వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో అక్రమాలు జరిగాయని.. వీటిపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇళ్ల మంజూరులో అప్పటి జాయింట్ కలెక్టర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
సామరస్యానికి ప్రతీక అయిన కడప జిల్లా ప్రజలకు సకల శుభాలతో పాటు ఆయురారోగ్యాలు అందాలని, అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటన ద్వారా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినం అత్యంత భక్తి, ప్రీతికరమైనదన్నారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ దానగుణానికి, త్యాగానికి ప్రతీక అన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన కడప నగర పరిధిలోని అలంఖాన్ పల్లి సర్కిల్ దగ్గర జరిగింది. ఆదివారం రాత్రి కర్నూలు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటర్‌ని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మరణించారని, ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. మృతులు బద్వేల్ నివాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బద్వేల్ – పొరుమామిళ్ళ రోడ్డులో ఇవాళ రాత్రి 7 గంటలకు రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరసింహులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన నరసింహులు బద్వేల్ నివాసిగా గుర్తించారు.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పుడు సన్యాసం తీసుకుంటారని TDP నాయకుడు ముక్తియార్ ప్రశ్నించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు కట్టిస్తానని రాచమల్లు చెప్పారని ఎప్పుడు కట్టిస్తారని అడిగారు. ప్రార్థన మందిరాలకు చందాలు ప్రకటించారని, అసంపూర్తిగా ఉన్న పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
వైవీయూ పరిధిలోని న్యాయ కళాశాలలో చదువుతున్న LLB (3 & 5 ఇయర్స్) విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు విశ్వవిద్యాలయంలో జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఐదు, మూడేళ్ల LLB (రెగ్యులర్)తొలి సెమిస్టర్ పరీక్షలు 1, 3, 5, 8, 10 తేదీల్లో జరుగుతాయన్నారు. అలానే సప్లిమెంటరీ పరీక్షలు ఇదే తేదీల్లో ఉంటాయన్నారు.
భార్య అలిగి వెళ్లిందని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పీటీఎం మండలం, కందుకూరు పంచాయతీ, అగ్రహారానికి చెందిన శంకర(48)తో భార్య లక్ష్మి గొడవపడి వారం క్రితం అలిగి పుట్టినింటికి వెళ్లింది. తిరిగి కాపురానికి రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన శంకర ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లెకు తరలించారు.
Sorry, no posts matched your criteria.