India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య అలిగి వెళ్లిందని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పీటీఎం మండలం, కందుకూరు పంచాయతీ, అగ్రహారానికి చెందిన శంకర(48)తో భార్య లక్ష్మి గొడవపడి వారం క్రితం అలిగి పుట్టినింటికి వెళ్లింది. తిరిగి కాపురానికి రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన శంకర ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లెకు తరలించారు.
వైఎస్ జగన్‌పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన విషపూరిత వ్యాఖ్యలు టీడీపీ నీచ రాజకీయానికి, బలహీనతకు ప్రత్యక్ష నిదర్శమని వైసీపీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తాను ఎప్పుడు జగన్ వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదన్నారు.
ఐటీఐ ప్రవేశాలకు 19 నుంచి 21వ తేదీ వరకు కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల జిల్లా కన్వీనర్, మైనార్టీ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞాన కుమార్ తెలిపారు. 19న ఉదయం 9 గంటలకు 10 జీపీఏ నుంచి 7.4 జీపీఏ వరకు, 20న 7.3 జీపీఏ నుంచి 5.7, 21న 5.6 జీపీఏ నుంచి 3 జీపీఏ వరకు వారికి కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.
కమలాపురం మండలం చదిపిరాళ్ల వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లెకు చెందిన చింతకుంట ప్రసాద్ మృతి చెందినట్లు ఎస్సై హృషికేశ్వర్ రెడ్డి తెలిపారు. కడప నగరపాలక సంస్థలో ఉద్యోగం చేస్తున్న అతను బైక్‌పై వెళుతుండగా చదిపిరాళ్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
భారతదేశ ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2025 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా క్రీడలతో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా అవార్డులు అందజేయనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. కళలు, విద్య, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్ వర్క్, సివిల్ సర్వీసెస్ తదితర రంగాల్లో రాణించిన వారు జూలై 15వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కడప నగరంలోని రాజారెడ్డికి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును మనోజ్ కలిశారు. తన సమస్యను వివరించి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. సీఎం అతడికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మనోజ్ కుమార్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.
చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామం సోమయాజులపల్లి కంపచెట్ల వద్ద గుర్తుతెలియని మృతదేహం శనివారం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్ళతో కూడిన సమాచారాన్ని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రాయలసీమలో హైకోర్టు కానీ, హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ, హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు.
కడప జడ్పీ ఛైర్మన్‌గా శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న శారద పూర్తి స్థాయిలో జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రగతికి చేయూతనిస్తానని ఆమె అన్నారు.
కడప నగరంలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. జువెలరీ ప్రధాన రహదారికి ఇరువైపులా నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Sorry, no posts matched your criteria.