Y.S.R. Cuddapah

News April 19, 2024

‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

image

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

News April 19, 2024

మిథున్ రెడ్డి ఆస్తులు రూ.147 కోట్లు

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లుగా చూపించారు. అప్పులు రూ.54 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి వాహనాలు లేవని స్పష్టం చేశారు. తనకు 100 గ్రాములు, భార్య వద్ద 1.286 కేజీల బంగారం ఉన్నట్లు ప్రకటించారు..

News April 19, 2024

కడప: భూపేశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

కడప పార్లమెంట్‌కు TDP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేశ్ రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు PCలో నమోదైన SC, ST కేసులో పోలీసులు ఛార్జ్ సీటు వేయలేదని, జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. శిక్ష పడిన కేసులు లేవని వెల్లడించారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రెండు లక్షల బ్యాంకు డిపాజిట్లు చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

News April 18, 2024

కడప జిల్లాలో మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే?

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి కడప జిల్లాలో నేడు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం అయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప పార్లమెంట్ కు 2, అసెంబ్లీకి 3, జమ్మలమడుగుకు 2, ప్రొద్దుటూరుకి 1, మైదుకూరుకు 3 నామినేషన్ దాఖలు కాగా, బద్వేలు, పులివెందుల, కమలాపురం పరిధిలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు.

News April 18, 2024

బద్వేలు: రూ.5 కోట్ల విలువచేసే బంగారు, వెండి స్వాధీనం

image

బద్వేలులో భారీ మొత్తంలో బంగారు, వెండి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గోపవరం మండలం, పి.పి కుంట చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల విలువచేసే గోల్డ్ & సిల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి కడపకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇవి సీక్వెల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. ఎంపీకి పోటి చేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

News April 18, 2024

రాజంపేటకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు

image

రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.

News April 18, 2024

ప్రచారం పేరిట కబ్జాలు చేస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి

image

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం పేరిట భూకబ్జాలు, సహజవనరులు దోచుకుంటున్నాడని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానిక BJP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్యకేసు CM జగన్ దంపతులకు తెలియకుండా జరిగుండదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తానని ఆది హామీ ఇచ్చారు.

News April 18, 2024

నేటి నుంచే నామినేషన్: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలని, ఎంపీ అభ్యర్థి కడప కలెక్టర్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ వేయవచ్చన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.