Y.S.R. Cuddapah

News June 14, 2024

ప్రమాదకరంగా కడప-చెన్నై రహదారిలోని బ్రిడ్జ్

image

ఒంటిమిట్ట బస్టాండ్ సమీపంలోని శ్రీరామ నగర్ మలుపు వద్ద ఉన్న కడప-చెన్నై ప్రధాన రహదారి బ్రిడ్జికి పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ ఈ బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడితే కడప నుంచి రాజంపేట, కోడూరు, తిరుపతి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతాయి.

News June 14, 2024

కడప: తిరుమల ఎక్స్‌ప్రెస్ నంబర్ల మార్పు

image

కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

News June 14, 2024

బద్వేలు: ప్రియురాలిని హత్య చేయబోయి.. ఆత్మహత్య

image

బద్వేలులో సాయికుమార్ రెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై సీఐ యుగంధర్ రెడ్డి స్పందించారు. కలసపాడుకు చెందిన సాయి కుమార్ సిద్దమూర్తిపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె సాయిని దూరం పెట్టింది. తన ప్రేమను నిరాకరించిదని ప్రియురాలిని హత్య చేయబోయిన సాయి.. అది బెడిసికొట్టడంతో తన అక్క ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

News June 14, 2024

కడప: ఆ కాలేజీకి 72 ఏళ్ల చరిత్ర

image

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. సరిగ్గా 72 సంవత్సరాల క్రితం 1952 జూన్ 14న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.వి.రాజగోపాలాచారి చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాల భవనాలకు శంకుస్థాపన జరిగింది. దీంతో ప్రతి ఏటా జూన్ 14న వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తెలిపారు.

News June 14, 2024

ప్రొద్దుటూరు: YSR ఇంజినీరింగ్ కాలేజీకి అదనంగా 130 సీట్లు మంజూరు

image

ప్రొద్దుటూరు YSR ఇంజనీరింగ్ కాలేజీ (వైవీయు)కి అదనంగా 130 సీట్లు AICTE మంజూరు చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య C.నాగరాజు గురువారం తెలిపారు. కాలేజీలోని 5 బ్రాంచ్‌లకు అదనంగా ప్రతి విభాగానికి 20 సీట్ల చొప్పున, మెటలర్జీ విభాగానికి 30 సీట్ల మొత్తం 130 అదనపు సీట్లకు AICTE అనుమతి ఇచ్చిందన్నారు. మే 20న AICTE కమిటీవారు వర్చువల్ పద్ధతిలో కాలేజీలోని అన్ని మౌలిక వసతులను తనిఖీ చేశారన్నారు.

News June 13, 2024

కడప జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులో..?

image

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి కడప జిల్లాలో 289 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు 700లకు పైగా పోస్టులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 13, 2024

ప్రొద్దుటూరు: YSR ఇంజినీరింగ్ కాలేజీకి అదనంగా 130 సీట్లు మంజూరు

image

ప్రొద్దుటూరు YSR ఇంజనీరింగ్ కాలేజీ (వైవీయు)కి అదనంగా 130 సీట్లు AICTE మంజూరు చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య C.నాగరాజు గురువారం తెలిపారు. కాలేజీలోని 5 బ్రాంచ్‌లకు అదనంగా ప్రతి విభాగానికి 20 సీట్ల చొప్పున, మెటలర్జీ విభాగానికి 30 సీట్ల మొత్తం 130 అదనపు సీట్లకు AICTE అనుమతి ఇచ్చిందన్నారు. మే 20న AICTE కమిటీవారు వర్చువల్ పద్ధతిలో కాలేజీలోని అన్ని మౌలిక వసతులను తనిఖీ చేశారన్నారు.

News June 13, 2024

బద్వేలు: ప్రమాదమా.. ఆత్మహత్య?

image

బద్వేలులో గురువారం అగ్ని ప్రమాదంలో <<13432512>>సాయికుమార్ రెడ్డి<<>> మృతి చెందిన విషయం తెలసిందే. అయితే సాయికుమార్ రెడ్డి ప్రేమ విఫలం అవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై సీఐ యుగంధర్ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

రాయచోటి: 62 ఏళ్లలో మొదటిసారి..

image

62 ఏళ్ల రాయచోటి నియోజకవర్గ చరిత్రలో ఓ అరుదైన రికార్డ్ నమోదయింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎందరో రాజకీయ ఉద్ధండులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గడికోట, పాలకొండ్రాయుడు వంటి వారు 4 సార్లు MLAగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. తాజాగా ఆ అదృష్టం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వరించింది.

News June 13, 2024

అన్నమయ్య: ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

image

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ని ఎవరో ఆయన ఇంటిలోనే మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సీఐ వల్లి భాష, శేఖర్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.