Y.S.R. Cuddapah

News April 16, 2024

నందలూరు: సివిల్స్‌లో మెరిసిన కృష్ణ శ్రీవాత్సవ్ యాదవ్

image

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

News April 16, 2024

అన్నమయ్య: 120 కేంద్రాల్లో స్లాష్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో స్లాష్ 2024 పరీక్షలు 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని డీసీఈబీ సెక్రటరీ కె నాగమునిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన అన్ని కేంద్రాలలో స్లాష్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏ కేంద్రానికి మినహాయింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

News April 16, 2024

కడప: యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

image

యోగివేమన యూనివర్సిటీలో సుల్తానా అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

బ్రహ్మంగారిమఠం:గాయపడ్డ వ్యక్తి మృతి

image

బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో జరిగిన కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బద్వేల్‌కు చెందిన టీవీఎస్ షోరూం నిర్వాహకుడు అంబవరపు జయసుబ్బారెడ్డి(55) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న సుబ్బారెడ్డికి తలకు తీవ్ర గాయాలుకావడంతో 108లో కడపకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 16, 2024

కడప: ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఆర్‌‌ఓలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 16, 2024

కడప: కత్తులతో దాడి చేసుకున్న YCP, TDP వర్గీయులు

image

ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడులో YCP, TDP వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన నరసింహులు, శంకరయ్యల మధ్య ఇంటి స్థలానికి సంబంధించి 2ఏళ్లుగా వివాదం ఉండటంతో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికలు తెలిపారు. TDPకి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి, చెంగమ్మ, నాగేశ్వరి, YCPకి చెందిన శంకరయ్య, నాగేంద్ర గాయపడ్డారు. కేసు నమోదు చేసినట్లు SI చిన్న పెద్దయ్య తెలిపారు.

News April 16, 2024

కడప: వైసీపీలోకి మరో TDP మాజీ ఎమ్మెల్యే?

image

ఉమ్మడి కడప జిల్లాలో TDPకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రమేష్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి YCPలోకి చేరుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కమలాపురం నుంచి 3సార్లు MLAగా గెలిచారు. TDP టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో TDPని వీడుతున్నాని సోమవారం ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన YCPలో చేరుతారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనేది చూడాలి.

News April 16, 2024

16న కోదండరామనికి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయని ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

News April 15, 2024

నామినేషన్లకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని విభాగాల నోడల్ అధికారులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), ఈ ఆర్వోలతో వీసీ నిర్వహించారు.

News April 15, 2024

కడప: 20 నుంచి YVU డిగ్రీ పరీక్షలు

image

కడప: యోగి వేమన యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల1, 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ (2023- 24), బ్యాచ్, 2వ సెమిస్టర్ (2016-17), (2020-21), (2023-24) బ్యాచ్ లు, 4వ సెమిస్టర్ (2016-17), (2023-24) బ్యాచ్, 6వ సెమిస్టర్ (2016-17) విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.