India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ సాయి నగర్‌కు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయవాడలోని కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గత ఎన్నికల్లో భారీగా పందేలు పెట్టి పెద్దమొత్తంలో డబ్బు నష్టపోయినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలు సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో కొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతన్ని బుల్లెట్ సుబ్బారావు అని కూడా అంటారు.
కడప జిల్లాలో 20 ఏళ్లుగా ఒక కలలా ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఈ సారి పూర్తి అవుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. అందులోనూ అతను బీజేపీ ఎంపీ కావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఉండటంతో కడప ఉక్కు పరిశ్రమ సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటన ఒంటిమిట్ట మండలంలోని ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు కోనేటి గంగమ్మ తన ఇంటిలోని ఫ్రిజ్‌ను తెరవగా కరెంట్ షాక్ తగిలి అరుపులు వేసింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న పేరూరు కొండయ్య అరుపులు విని ఇంటిలోకి వెళ్ళి ఆమెను రక్షించబోయే అతడు కరెంట్ షాక్‌కు గురై మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిసి టీడీపీ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు.
పాలిటెక్నిక్ విద్యలో భాగంగా ఉన్న డిప్లమో ఇన్ ఫార్మసీ (డి ఫార్మసీ) కోర్సు ప్రవేశానికి ఈ నెల 15వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్ తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఆర్ వెంకట సుబ్బారెడ్డి (మాసీమ బాబు) ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే రాజీనామా చేసిన నేపథ్యంలో పాలకమండలి సభ్యులైన మాసీమ బాబు కూడా రాజీనామా చేశారు.
అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను
ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బాలకార్మికుల నిర్మూలనపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపెండ్లిమర్రి మండలం యాదవాపురంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆదిమూలం వెంకట కృష్ణయ్యకు (54) గుండె నొప్పిగా ఉందని కుటుంబీకులు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయామని ఇంక మాకు దిక్కెవరని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.
సుండుపల్లె మండలంలోని పించా దగ్గర ఉన్న చర్చి ఎదుట సోమవారం రెండు బైకులు అతి వేగంతో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సుండుపల్లె ఎస్సై హుస్సేన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో హెల్త్ సూపర్వైజర్, మేల్ నర్స్, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కడప జిల్లా కోఆర్డినేటర్ ఎల్. మాధవిలత తెలిపారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.