India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.
సామాజిక, సేవా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం అర్హులైన వారు జూలై 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు https://awards.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీపై టీడీపీ కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి, రాయచోటిలో రమేశ్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉండేవారు. కాగా రెండు చోట్ల వైసీపీకి పరాభవం తప్పలేదు. రాయచోటిలో 2,495, కమలాపురంలో 25,357 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు గెలిచారు.
వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులను తిరిగి మనం చేయకూడదని ఎమ్మెల్యేగా ఎన్నికైన వరదరాజులరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని అందరం కలిసి కట్టుగా అభివృద్ధిపై దృష్టి పెడదామన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తనకు తెలిపి హుందాతనాన్ని చాటారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి వెళ్లిపోయారని ఆరోపించారు.
రాయచోటి మండలం బోయపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయులపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బోయపల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు, వైసీపీకి చెందిన వారు దాడి చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు దాడికి దిగిన 16 మంది వైసీపీ వర్గీయులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంబేపల్లె మండల పరిధిలోని మోటకట్ల విద్యుత్తు ఉప కేంద్రం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాయచోటి పట్టణానికి చెందిన షేక్ బాజ్జీ (39) కలకడ వైపు నుంచి రాయచోటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, పాఠశాల బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాజ్జీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల తరఫున ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఏలూరు పార్లమెంటు(టీడీపీ) నుంచి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, అనకాపల్లి పార్లమెంట్(బీజేపీ) నుంచి సీఎం రమేశ్, కడప ఎంపీగా (వైసీపీ) వైఎస్ అవినాశ్‌రెడ్డి గెలిచారు. దీంతో మూడు పార్టీల ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే.
కక్ష సాధింపులు మా అభిమానం కాదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడకూడదని ఆదేశించారన్నారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేవలం 11 సీట్లు సాధించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ప్రజలకు అందించారో తేలిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తామన్నారు.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. కడప జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. కడప- అప్సర, ప్రొద్దుటూరు- అరవేటి థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT
ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన వీరబల్లిలో జరిగింది. రాయపాటి పట్టణంలోని నయాసాబ్ వీధికి చెందిన టైలర్ షకిల్ కుమారుడు అద్నాన్(14) పదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. పుల్లగూర గండిలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అద్నాన్ మృతి చెందాడు. ఇంట్లోని పెద్ద కొడుకుని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.