Y.S.R. Cuddapah

News April 12, 2024

కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్‌ ఫలితాలు ఇవే..

image

☛ 2020లో ఇంటర్‌ మొదటి సంవత్సరం 47 శాతం.. ☛ 2020లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 53 శాతం ఉత్తీర్ణత ☛ 2021 అకడమిక్‌ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం ఉత్తీర్ణత ☛ 2022లో ఇంటర్‌ మొదటి సంవత్సరం 41 శాతం.. ☛ 2022లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 50 శాతం ఉత్తీర్ణత ☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత ☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత

News April 12, 2024

కడప: ఇంటర్‌లో ఎంతమంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కడప జిల్లాలో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,470 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 7,954 మంది పాస్ అయ్యారు. 55 శాతం ఉత్తీర్ణతతో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 12,131 మందికి గాను, 8,375 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 69 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొదటి సంవత్సరం కంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కడప జిల్లా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చాయి.

News April 12, 2024

సీఎం జగన్ పోటీ చేసేది ఈమెనే

image

భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందులలో సీఎం జగన్‌పై సూరే నిర్మల పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పై పోటీ చేస్తున్న మొదటి మహిళగా నిలవనున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో నిర్మల పోటీ చేస్తుండటంతో బీసీల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.

News April 12, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రమేశ్‌రెడ్డి

image

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు అధిష్ఠానం ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా రమేశ్‌రెడ్డి రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News April 12, 2024

కడప: ప్రియుడి కోసం భర్తను చంపింది

image

ఎర్రగుంట్లకు చెందిన రాంబాబు, మాధవి భార్యాభర్తలు. భరత్ అనే వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో తల్లి, ప్రియుడితో కలిసి అడ్డు తొలగించాలనుకున్నారు. తొలుత రాంబాబు పేరుతో రూ.20 లక్షలకు బీమా చేయించారు. ఈ నెల 2న రాంబాబును టవల్‌తో గొంతు బిగించి హత్య చేసి, సైలెంట్ అయ్యారు. దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రాగా, గురువారం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు.

News April 12, 2024

కడప: ‘బీసీలు బలవంతులు కాదు’

image

బీసీల భద్రతే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని టీడీపీ కూటమి తమ మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగిందని పులివెందలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. తొండూరులో నిర్వహించిన జయహో బీసీ సభలో వారు మాట్లాడారు. కూటమికి బీసీలే వెన్నెముక అన్నారు. బీసీలంటే బలహీనులు కాదని బలవంతులన్నారు.  

News April 11, 2024

రాయచోటిలో రమేశ్ రెడ్డి ప్రభావం ఎంత?

image

మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి తొలిసారి 1999లో లక్కిరెడ్డిపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డిపై 10,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో మోహన్ రెడ్డి చేతిలో 13,052 ఓట్లతో ఓడిపోయారు. 2014, 19లో రాయచోటిలో పరాజయం పాలయ్యారు. 2019లో 66,128 ఓట్లు, 2014లో 62,109 ఓట్లు సాధించిన ఆయన టీడీపీకి రాజీనామా చేయడం తాజా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

News April 11, 2024

కడప: షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

image

12, 13వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదలైంది.
12వ తేదీ వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. అనంతరం పులివెందుల పూలంగళ్ళో మీటింగ్ నిర్వహించనున్నారు.
13వ తేదీ ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బస్సు యాత్రను షర్మిల చేపట్టనున్నారు.

News April 11, 2024

సిద్దవటం: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

సిద్దవటం గాంధీ వీధిలో నివాసమున్న రెడ్డి మోహన్(18) భాకరాపేట-కనుములోపల్లి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ పై రైలు కింద మృతి చెందాడు. బుధవారం రాత్రి 2:30 గంటలకు గుర్తించామని, మృతికి గల కారణాలు విచారిస్తున్నామని రైల్వే పోలీసులు తెలియజేశారు. మృత్యువాత పడ్డ వ్యక్తి రెడ్డి మోహన్ ద్విచక్రవాహనంలో వచ్చాడని తెలిపాడు. స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించామని రైల్వే పోలీసులు అన్నారు.

News April 11, 2024

కలసపాడు: మెట్ల పైనుంచి పడి వ్యక్తి మృతి

image

కలసపాడు మండలం శంఖవరంలో బుధవారం రమణారెడ్డి అనే వ్యక్తి మెట్లపై నుంచి జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకవరంలో చిన్న కృష్ణారెడ్డి ఇంట్లో అతని కుమారుడు చరణ్ రెడ్డితో మాట్లాడేందుకు వెళుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.