India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరుకు చెందిన పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు YCP ఓటమితో శుక్రవారం రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి,ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రవిచంద్ర, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన నంద్యాల వరదరాజులరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని మండలం కామనూరుకు చెందిన యువకులు అహోబిలం క్షేత్రంలోని నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కామనూరు చెందిన మల్లికార్జున్ రెడ్డి, సునీల్ కుమార్, సురేంద్ర యాదవ్, దస్తగిరి యాదవ్, శివచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేశారు.
విభజన సందర్భంగా ప్రకటించిన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ఏర్పాటయ్యేనా.. అని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుంది కడప జిల్లాలోని నిరుద్యోగ యువత పరిస్థితి అన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలన్న సత్సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2014, సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మంజూరయిందన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జయకేతనం ఎగరేసింది. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన నలుగురు అభ్యర్థులు హ్యాట్రిక్ మిస్ అయ్యారు. వారిలో
ఎస్.రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. కాగా శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఈసారి ఓటమి పాలయ్యారు. దీంతో దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకులు ఓటమి రుచి చూశారు.
జగన్ ఇలాకాపై TDP పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గ స్థానాల్లో ఏడింటిలో గెలిచింది. దీంతో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనదే చర్చ. YCP కంచుకోటలో భారీ మెజార్టీ సాధించడంలో నేతల కృషి మరువలేనిది. పలువురు మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. మరి సామాజికవర్గాల వారిగా పరిశీలించి చంద్రబాబు కేబినేట్లోకి ఎవరిని చేర్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
YS వారసులుగా రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్, షర్మిల తమ మార్క్ చూపిస్తున్నారు. జగన్ YCPని స్థాపించి సీఎం అయ్యారు. ఇక షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టి ప్రత్యర్థులకు విమర్శలు సందిస్తూ ఆ పార్టీలే ఓడేలా చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఆమె గెలవకపోయినా నైతికంగా గెలిచారంటున్నారు. 2019లో TDP, 2024లో తెలంగాణాలో BRS, APలో YCP పార్టీలకు ఎదురెళ్లి ఓడించారని షర్మిల అభిమానులు సోషియల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కడప అభివృద్ధికి అంజాద్ బాషా వెచ్చించానని చెబుతున్న రూ.2 వేల కోట్లకు లెక్క తేల్చాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో తిన్న అవినీతి సొమ్ముని కక్కించి, కబ్జా చేసిన పేదల భూములను పేదలకు పంచి పెడతానన్నారు. ఎన్నికలకు ముందు జగన్ కడపలో తన ముఖం చూసి ఓట్లు వేయమన్నారని.. ఇక్కడ అంజాద్ బాషాను ఓడించామంటే జగన్ను ఓడించినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ జెండా ఎగరేశామన్నారు.
రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న షేక్ ముక్తియార్ అలీకి అనంతపురం JNTU పీహెచ్డీ ప్రధానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ తెలిపారు. ‘కాస్ట్ అలకేషన్ ఇన్ ఏడీ రెగ్యులేటరీ పవర్ సిస్టమ్ విత్ రిలైబులిటీ ఇండెక్స్’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ప్రధానం జరిగిందని తెలిపారు.
ప్రొద్దుటూరు ఆగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్త్యేశ్వర స్వామికి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఆగస్త్యేశ్వర స్వామి మూలవిరాట్కు వేద పండితులు మంత్రోచ్ఛారణలతో భస్మాభిషేకం నిర్వహించి భస్మ హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడిగా ఉన్నటువంటి ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అన్నారు. తన రాజీనామా పత్రాన్ని చీఫ్ సెక్రటరీకి ఈ మెయిల్ ద్వారా పంపినట్లు తిరుపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తిరుపాల్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.