Y.S.R. Cuddapah

News August 14, 2024

జనంపై జగన్ కక్ష కట్టాడు: బీటెక్ రవి

image

కర్నూల్ జిల్లాలో జరిగిన TDP మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యపై పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి X (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘ఐదేళ్ల నరకాసుర పాలనకు చరమగీతం పాడారని జనంపై కక్ష కట్టాడు జగన్. ప్రజా తీర్పును భరించలేక హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులును YCP కిరాయి మూకలు మట్టుపెట్టాయి.’ అని పేర్కొన్నారు. ‘వైకాపోన్మాదం ప్రజాతీర్పును భరించలేకపోతోంది’ అంటూ ఓ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

News August 14, 2024

కడప: ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకం

image

ఈ ఏడాది ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదలకు గానూ 3 విడతలుగా వివిధ కేటగిరీలకు చెందిన 20 మంది జాబితాను హోంశాఖ వారికి జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఖైదీల విడుదల ఉండదని, గాంధీ జయంతి రోజున విడుదల చేస్తామని ఇటీవల ఓ సమావేశంలో హోం మంత్రి అనిత పేర్కొన్న నేపథ్యంలో ఆగస్టు 15న ఖైదీల విడుదల లేనట్లేనని తెలుస్తోంది.

News August 14, 2024

కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 19న ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. వి సలీం బాషా తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఎంఎస్సీ జువాలజీలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఏపీసెట్, నెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

News August 14, 2024

వైవీయూ బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొ. కృష్ణారెడ్డి, కులసచివులు ప్రొ. రఘునాథరెడ్డి, సీఈ ప్రొ. ఈశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రొ. జయరాంరెడ్డితో కలిసి విడుదల చేశారు. సివిల్ ఇంజినీరింగ్(86.36శాతం), కంప్యూటర్ సైన్స్(100శాతం), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ (88.89శాతం), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (100శాతం), మెకానికల్ విద్యార్థులు 75శాతం మంది పాసయ్యారు.

News August 14, 2024

మొదటి విడతలో కడపకు దక్కని ఛాన్స్

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలలో కడప జిల్లాకు స్థానం దక్కలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసే జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కడప జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభానికి చోటు దక్కలేదు. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత జాబితాలో జిల్లాకు స్థానం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సిఉంది.

News August 14, 2024

వైవియూలో నేడు మెగా మెడికల్ క్యాంపు

image

వైవీయూ కడప రోటరీ క్లబ్ సహకారంతో ఈ నెల 14వ తేదీన డా ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో ‘మెగా మెడికల్ క్యాంప్’ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ క్యాంపులో ప్రముఖ వైద్యులు వారణాసి ప్రతాప్ రెడ్డి (డయాబెటిస్), డా. ఏ. వంశీధర్ (కార్డియాలజిస్ట్), డా. ఏ. విద్యాధర (నేత్ర వైద్యుడు), డా. ఎం.డి. ఫర్హానుద్దీన్ (డెంటిస్ట్) సేవలందిస్తారన్నారు.

News August 13, 2024

కడప జిల్లాలో సీఐల బదిలీలు

image

కడప జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు రేంజ్ పరిధిలో దాదాపు 62 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన సీఐలను బదిలీ చేస్తూ.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. పోస్టింగ్ ఇవ్వగా, పలువురిని వీఆర్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

News August 13, 2024

రైల్వే కోడూరు: జీతం అడిగినందుకు మహిళపై దాడి

image

జీతం అడిగినందుకు రూంలో వేసి ఓ మహిళను చితకబాది గాయపరిచిన ఘటన సోమవారం ఒక రైల్వే కోడూరులో జరిగింది. బాధితురాలి కథనం మేరకు రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేటలో ఒక హోటల్‌లో పావని పనిచేస్తోంది. మూడు నెలల నుంచి హోటల్ యజమాని జీతం ఇవ్వలేదని నిలదీసింది. దీంతో యజమాని హోటల్‌లోని ఒక గదిలో వేసి తలుపులు మూసివేసి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 13, 2024

దువ్వూరు: కన్నీళ్లు పెట్టించే ఫొటో

image

దువ్వూరు వద్ద కేసీ కెనాల్‌లో నిన్న ఓ ఎండ్ల బడి పడి ఓ <<13835710>>ఎద్దు<<>> చనిపోయిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలు అందరినీ కలచివేస్తున్నాయి. రైతులు భూమిని, తమ పాడి పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటికి ఏ మాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటిది అన్ని రోజులు తమకు అండగా ఉన్న ఓ ఎద్దు కళ్ల ముందు చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. ఎద్దు కళేబరం వద్ద బోరున ఏడ్చారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది.

News August 13, 2024

పులివెందుల: బైకును ఢీకొట్టిన మినీ బస్సు.. ఒకరు మృతి

image

లింగాల మండలం పార్నపల్లె వద్ద మినీ బస్సు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు కసునూరికి చెందిన ఫొటోగ్రాఫర్ బోనాల హరిగా స్థానికులు గుర్తించారు. భార్యాభర్తలు ఇద్దరు బైక్‌పై అనంతపురానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.