Y.S.R. Cuddapah

News June 5, 2024

జమ్మలమడుగులో రికార్డు బ్రేక్

image

జమ్మలమడుగులో ఓ రికార్డు బద్దలయింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు MLAగా గెలిచిన వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి నిలిచారు. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో YCP నుంచి, ఇప్పుడు BJP నుంచి పోటీచేసి కూడా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పొన్నపురెడ్డి శివారెడ్డి గెలిచారు. ఆయన రికార్డును ఆదినారాయణ రెడ్డి బ్రేక్ చేశారు.

News June 5, 2024

కడప: అతిచిన్న ఎమ్మెల్యే.. అతిపెద్ద ఎమ్మెల్యే

image

కడప జిల్లాలో కూటమి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. జిల్లాలో కూటమికి 7 స్థానాలు, YCPకి 3స్థానాలు వచ్చాయి. వీరిలో కోడూరు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ జిల్లాలో అతి చిన్న ఎమ్మెల్యే (27)గా నిలిచారు. అలాగే ప్రొద్దుటూరు TDP ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరద రాజుల రెడ్డి అత్యంత పెద్ద వయస్సుగల ఎమ్మెల్యే (82)గా నిలిచారు. ఈయన రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యంత పెద్ద వారు కావడం గమనార్హం.

News June 5, 2024

దేశం తరఫున సత్తా చాటిన రైల్వేకోడూరు యువకుడు

image

రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సయ్యద్ అబూబకర్ మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ -2024 పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 2న థాయిలాండ్ లో జరిగిన పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల నుంచి పలువురు యువకులు పాల్గొనగా ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యాన్ని వివరించేలా నిర్వహించిన కార్యక్రమాలలో ప్రతిభ చూపడంతో రన్నరప్ సాధించినట్లు తెలిపారు.

News June 5, 2024

కడప జిల్లా ఎమ్మెల్యేలు వీరే.. మెజార్టీ ఇదే.!

image

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి 17191
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి 22744
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి 25357
బద్వేల్ – దాసరి సుధ 18567
పులివెందుల- వైఎస్ జగన్ 61687
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ 20950
కడప – మాధవి రెడ్డి 18860
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి 2495
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 7016
రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ 11101

News June 5, 2024

మైదుకూరు: తండ్రీకొడుకులు గెలుపు

image

2024 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టా ఇంట మరపురాని ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి తండ్రి ఎమ్మెల్యేగా, తనయుడు ఎంపీగా విజయం సాధించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా కుమారుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ టీడీపీ తరఫున పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పైన భారీ మెజార్టీతో విజయం సాధించారు. తండ్రి తనయులు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒకేసారి గెలిచారు.

News June 5, 2024

అవినాష్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత

image

కడప ఎంపీగా ఎన్నికైన వైయస్ అవినాష్ రెడ్డికి ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిల, కూటమి అభ్యర్థి భూమేష్ రెడ్డి మీద భారీ మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలుపొందారు. వరుసగా మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు అవినాష్ రెడ్డికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 4, 2024

కడప జిల్లా ఎమ్మెల్యేలు వీరే

image

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
బద్వేల్ – దాసరి సుధ
పులివెందుల- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
కడప – రెడ్డప్పగారి మాధవి రెడ్డి
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
రైల్వే కోడూరు – అరవ శ్రీధర్

News June 4, 2024

చివరి రౌండ్‌కి విజయం సాధించిన మండిపల్లి

image

రాయచోటి నియోజకవర్గ ఫలితం తేలింది. చివరి రౌండ్ వరకు దోబూచులాడి ఆఖరి రౌండ్లో మండిపల్లికి విజయాన్ని అందించింది. గడికోటపై మండిపల్లి 1000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా ఇది ఉమ్మడి జిల్లాలో చివరి ఫలితం. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7, వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి.

News June 4, 2024

రాయచోటి ఫలితంపై ఉత్కంఠ

image

రాయచోటి నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో గడికోట ముందంజలో ఉండగా.. చివర్లో అనూహ్యంగా మండిపల్లి ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 20 రౌండ్లు ముగిసేసరికి 871 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి మండిపల్లి ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం లెక్కించాల్సి ఉంది.

News June 4, 2024

రాజంపేట: ఆకేపాటి విజయం

image

రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈయనకు మొత్తం 92609 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యానికి 85593 ఓట్లు సాధించారు. దీంతో ఆకేపాటి 7016 ఓట్లతో విజయం సాధించారు.