Y.S.R. Cuddapah

News June 4, 2024

రైల్వే కోడూరు: అరవ శ్రీధర్ విజయం

image

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఈయనకు మొత్తం 77701 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసుకి 67002 ఓట్లు సాధించారు. దీంతో శ్రీధర్ 10699 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదటి సారి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేశారు.

News June 4, 2024

రాయచోటి: అనూహ్యంగా టీడీపీకి లీడింగ్

image

రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి అనూహ్య లీడింగ్ వచ్చింది. 19రౌండ్ వరకు లీడ్ ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, 20వ రౌండ్‌లో 871 ఓట్లతో వెనుకపడ్డారు. ఇక చివరిగా ఒక్క రౌండ్ ఉంది. తుది విజేత ఎవరో కాసేపట్లో తేలనుంది.

News June 4, 2024

దాసరి సుధ గెలుపు

image

బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలిచారు. ఆమెకు 90,410 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నకు 81,843 ఓట్లు పడ్డాయి. దీంతో 8,567 మెజార్టీ ఓట్లతో గెలిచారు. దీంతో ఆమె రెండో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

News June 4, 2024

పుత్తా చైతన్య రెడ్డి విజయం

image

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా

News June 4, 2024

ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

image

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News June 4, 2024

గెలుపు దిశగా నంద్యాల వరదరాజుల రెడ్డి

image

ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికి 18 రౌండ్‌ ముగిసేసరిగి 22వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇక కేవలం రెండు రౌండ్లు ఉండటంతో ఆయన గెలుపు లాంచనమే అని తెలుస్తోంది.

News June 4, 2024

ముందంజలో మిథున్ రెడ్డి

image

రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 16367 ఓట్లతో ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు 258603 ఓట్లు మిథున్ రెడ్డికి పోలవ్వగా.. కిరణ్ కుమార్ రెడ్డికి 241395 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

వెనుకంజలో జగన్ మేనమామ

image

కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 8వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ చైతన్య రెడ్డి: 40562
➢  రవీంద్రనాథ్ రెడ్డి: 28244
➠ 8వ రౌండ్ ముగిసే సరికి పుట్టా చైతన్య రెడ్డి 12318 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

కడప ఎంపీపై పెరుగుతున్న ఉత్కంఠ

image

కడప ఎంపీ స్థానంపై ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పటి వరకు 2,59,829 ఓట్ల వైఎస్ అవినాష్ రెడ్డికి పోలవ్వగా.. భూపేశ్ రెడ్డికి 2,26,373 ఓట్లతో వచ్చాయి. ఇక షర్మిలాకు 55,926 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు స్వల్ప మెజార్టీతో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

కడప జిల్లాలో కూటమి హవా

image

కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. వైసీపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కూటమి అభ్యర్థులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. పులివెందుల, బద్వేల్, రాయచోటి, రాజంపేటలో అధికార పార్టీనేతలు ఆధిక్యంలో ఉన్నారు. కోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.