India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుల్లంపేట మండలం రామక్కపల్లెలో జయసింహ అనే రౌడీ షీటర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జయసింహ తల్లిదండ్రులు చాలా కాలంగా ఉపాధికోసం కువైట్ వెళ్లారు. గొడవల కారణంగా అతడిపై ఆరేళ్ల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సింది ఉంది.
కడప బిల్డప్ సర్కిల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల.. వెంకటేశ్(32) మద్యానికి బానిసై, అందరితో గొడవపడేవాడు. దీంతో భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. సాధిక్ వలితో ఇతనికి పాతగొడవలు ఉండేవి. దీంతో నిన్న సాధిక్ వెంకటేశ్‌ను హత్య చేశాడు. గతంలో తనను చంపడానికి యత్నించాడని, తల్లిని హింసించేవాడని, కొడుకు హత్యకు గురయ్యాడనే బాధ తనకు లేదని వెంకటేశ్ తండ్రి కృష్ణయ్య అన్నాడు.
రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని ఆదేశించారు. కడప పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచారం వచ్చేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ నేతల మధ్య వైరం, నియోజకవర్గాల వారిగా సమస్యలు వివరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
రాజంపేట మండలం పోలి చెరువుకట్ట సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ ఏకశిర సుబ్బయ్య(27) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యాబిడ్డలు కన్నీటీపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడపలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బిల్డప్ సర్కిల్ వద్ద గల పుత్తా ఎస్టేట్‌లో వెంకటేశ్ అనే రౌడీ షీటర్‌ను కొద్దిసేపటి క్రితం దుండగులు హతమార్చారు. ఈరోజు సాయంత్రం వెంకటేశ్ కొంతమందితో మద్యం తాగుతున్న క్రమంలో మత్తులో మాటకు మాట పెరగడంతో గాజు సీసాతో వెంకటేశ్‌ను పొడవగా, మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యోగి వేమన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా రామకృష్ణారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ హరిత డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆమె మాట్లాడుతూ.. SK యూనివర్సిటీ రిజిస్టర్‌గా రామకృష్ణారెడ్డి పనిచేసే సమయంలో అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, దీంతో ఏడాదిన్నరకే తొలగించారన్నారు. ఆయనను తొలగించుకుంటే ఆందోళన చేస్తామన్నారు.
అన్నమయ్య జలాశయ పున:నిర్మాణంపై ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చిన వరదలకు డ్యాం మట్టికట్ట తెగిన విషయం తెలిసిందే. అప్పటి పాలకులు రెండేళ్లలో జలాశయాన్ని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. కొంత కాలంగా ప్రాజెక్ట్‌లోకి విపరీతంగా వరద రావడంతో ఆ నీటిని వదిలేందుకు సరిపడా గేట్లు లేవని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
వెంకట్ దర్శకత్వంలో మానస్ హీరోగా తెరకెక్కిన సినిమా పోట్లగిత్త. ఈ సినిమాలో పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఓ ప్రముఖ పాత్ర పోషించారు. వేముల చింతలజూటూరుకు చెందిన మరో వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ విలన్ వీరప్ప పాత్రలో నటించారు. పులివెందుల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తులసి రెడ్డి వెల్లడించారు.
కడప జిల్లాలో త్వరలో 4జీ సేవలను అందించనున్నట్లు BSNL అనంతపురం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్ షాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భాగస్వామ్యంతో 4జీ సేవలను ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 460 సెల్ టవర్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. 2జీ, 3జీ సిమ్ కలిగి ఉన్నవారు ఉచితంగా 4జీ సిమ్ పొందవచ్చునన్నారు.
Sorry, no posts matched your criteria.