India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పులివెందులకు చెందిన ఓ విద్యార్థిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని SKUలో MBA రెండో సంవత్సరం చదువుతోంది. వసతి గృహంలో ఉరివేసుకుంటున్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ప్లంబింగ్ పనులు చేస్తున్న సిబ్బంది కాపాడారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్లో డిజిటల్ బోర్డులు, పార్కింగ్, సి.సి కెమెరాలు, లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని బీజేపీ రైల్వే కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పేరుకే రైల్వేకోడూరు కానీ ఇక్కడ ముఖ్యమైన రైళ్లు ఆగవు అంటూ నిరసన తెలిపారు. హరిప్రియ ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా, ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లకు “స్టాపింగ్” కల్పించాలని రైల్వేస్టేషన్ మాస్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
YCP ఐదేళ్ల పాలనలో ఇసుక దందాలో రూ.10వేల కోట్లు దోచేశారని ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. YCP పాలనలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమైనదని దాన్ని రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ MLA రాచమల్లు భూములను ఆక్రమించారన్నారు. ఇక్కడ ఇసుక డంప్ పెట్టేలా కలెక్టర్‌ను కోరుతామన్నారు.
ఖాజీపేట మండలంలోని కే.సుంకేసుల గ్రామంలో 11 కె.వి విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలంలోకి వెళితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. పొలం సాగు చేయలేకపోతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.
జమ్మలమడుగులో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి రూ.4 కోట్లకు ఐపీ పెట్టి కనిపించకుండా పోయినట్లు స్థానికులు తెలిపారు. పదేళ్లుగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులతో నిందితుడు సన్నిహితంగా ఉండడంతో అతనికి వస్తువులను సరఫరా చేశారు. నెల రోజుల నుంచి స్టోర్ మూత వేసి ఉండటం, ఫోనుకు స్పందించకపోవడంతో సరకు ఇచ్చిన వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొంత మందికి నిందితుడు ఐపీ తాఖీదులు పంపాడు.
ముస్లింలకు పవిత్రమైన మొహర్రం పండుగతో పాటు తొలి ఏకాదశిని పురస్కరించుకొని నేడు కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఇప్పటికే వీటికి సంబంధించిన సర్కులర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు పంపించామని ఆమె స్పష్టం చేశారు.
అన్నమయ్య జిల్లాలో వినాయకచవితి, దసరాకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాలను తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
నందలూరులో వెలసిన సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సౌమ్యనాథ స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మాడవీధులలో విహరిస్తూ ఉంటే భక్తులు గోవింద నామాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఓ బైక్‌ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతల గ్రామానికి చెందిన కృష్ణయ్య, సింహాద్రిపురం మండలానికి చెందిన కిట్టయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.