India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామాపురం మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌లో చిత్తూరు నుంచి నంద్యాలకు వెళుతున్న మద్యం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పది కేసుల మద్యం స్థానికులు తీసుకెళ్లారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం లోడులో ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని లారీ నిర్వాహకులు తెలిపారు.
చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అక్బర్ (40) అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేయించుకుంటున్న సమయంలో తమ్ముడు భాషాఖాన్ (38)కి అన్నకి స్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో అన్నను తమ్ముడు కత్తితో పొడివగా, తప్పించుకొనే క్రమంలో చేతికి కూడా గాయమైంది. దీంతో కుటుంబీకులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.
ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి నుంచి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతకొమ్మదిన్నె మం, జయరాజ్ గార్డెన్స్ వద్ద చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన తిరుమలయ్య అనే బంగారు వ్యాపారి ఈ నగదును చెన్సైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. బిల్లులు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించారు.
ఈనెల 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో కడప జిల్లాలో అల్లర్లు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పోలీసులు పలు చర్యలు తీసుకోనున్నారు. జమ్మలమడుగులో ఆరుగురిని జిల్లా నుంచి బహిష్కరణ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కడప, బద్వేలు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే కొందరిని నేతలకు నోటీసులు ఇచ్చారు. ట్రబుల్ మాంగర్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల ఫలితాల కోసం కడప జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. దీంతో సీట్లపై కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
రాయచోటి పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నమండెంకు చెందిన పవన్ కుమార్ (35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రాయచోటిలోని వెంకటేశ్వరస్వామి ఆలయ వీధిలో నివాసం ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పది రోజుల కిందట భార్య శారద ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం నెల్లూరు జట్టు విజయం సాధించాయి. నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కడప జట్టుపై విజయం సాధించింది. కడప బ్యాట్స్‌మెన్ వంశీకృష్ణ 100 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. నెల్లూరు బ్యాట్స్‌మెన్ ఫర్హాద్ ఖాద్రి 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి నెల్లూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అన్నమయ్య జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కట్లుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇద్దరిపై జిల్లా బహిష్కరణ చర్యలు చేపట్టారు. రాజంపేట జడ్పీటీసీ భర్త దాసరి పెంచలయ్య, పుల్లంపేట రాజారెడ్డిపై కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో అడుగు పెట్టవద్దన్నారు. అలాగే రాజంపేట, కోడూరులో 60 మందికి గృహనిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.
సింహాద్రిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దావూద్ హుస్సేన్ ఏపీ ఈసెట్‌లో 105 ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దావూద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల బోధన, సహకారం వలన 105వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. హుస్సేన్‌ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్న సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు, అల్లర్లకు తావు లేని విధంగా ప్రశాంత కౌంటింగ్ కు పటిష్ఠ చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు తాజాగా జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను వారం రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అలాగే మరో 32 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.