Y.S.R. Cuddapah

News May 31, 2024

రాయచోటి: 3 రోజులు మద్యం అమ్మకాలపై నిషేధం

image

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల లెక్కింపు సందర్భంగా జూన్ నెల 3, 4, 5వ తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

News May 31, 2024

కడప: అంధుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు చేరవచ్చని తెలిపారు. జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.

News May 31, 2024

కడప: ఎన్నికల ఫలితాలకై ఉత్కంఠతో ఎదురుచూపులు

image

వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసే ఫలితాలు ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

News May 31, 2024

మైదుకూరు MLA రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట

image

మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చాపాడు పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ఈనెల 6వ తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుతో సహా ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

News May 31, 2024

కడప: డబ్బులు ఇవ్వకపోతే బెయిల్ రానివ్వను

image

ప్రొద్దుటూరులో రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఓ వ్యక్తికి రిమాండ్‌కు పంపే క్రమంలో నిందితుడిని కానిస్టేబుల్ రూ.5 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తామన్నా వినలేదు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో కానిస్టేబుల్‌పై ACBకి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే కానిస్టేబుల్ పై పలు ఆరోపణలు వచ్చాయన్నారు.

News May 31, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కడప ఎస్పీ

image

జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలు, కేంద్రాలకు వెళ్లే దారుల వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరి కదలికలను కెమెరాలు రికార్డు చేస్తాయనే విషయాన్ని గమనించాలన్నారు.

News May 30, 2024

కడప: ‘నీటి సమస్యనా ఈ నంబర్‌కి కాల్ చేయండి’

image

కడపలో నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావలని కడప నగరపాలక సంస్థ పేర్కొంది. ‘నీరు చాలా విలువైనది, కాబట్టి దానిని తెలివిగా వినియోగిద్దాం! ఇవాళ మనం పొదుపు చేసే ప్రతి చుక్క రేపటిని నిర్ధారిస్తుంది. నీటి సరఫరా సమస్యల గురించి విచారించడానికి 9949093772 నంబర్‌ను సంప్రదించాలి’ అంటూ X (ట్విటర్)లో పోస్ట్ చేసింది. చాలా ఆలస్యం కాకముందే నీటిని ఆదా చేద్దాం అనే నినాదంతో ముందుకువెళ్దామని పేర్కొంది.

News May 30, 2024

కడప: ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప జిల్లాలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైన్యంలో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు EVMలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 10-11గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వస్తుందన్నారు.

News May 30, 2024

కడప: 4 రోజుల్లో మన MLA ఎవరో తెలుస్తుంది

image

జిల్లాలో పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలను క్లీన్ స్విప్ చేసిన YCP ఈసారి అదే ధీమాతో ఉంది. అటు TDPకి ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారా అని చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.

News May 30, 2024

బి.కోడూరు: YCP నాయకుడిపై కేసు నమోదు

image

మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX ZPTC, YCP నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.