Y.S.R. Cuddapah

News March 27, 2024

కడప: భూపేశ్ రెడ్డికి షాక్

image

జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణ రెడ్డికి టికెట్ లభించింది. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలోకి చేరారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూపేశ్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.

News March 27, 2024

కడప: ప్రేమ పెళ్లి ..విషాదంతో ముగిసింది

image

పెద్దల నెదిరించారు, పోలీసు కేసులు, ఛేజింగ్ చివరికి ఐదు నెలల క్రితం పుల్లంపేట మండలం దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన హరికృష్ణ, చిట్వేలి కేకే వడ్డిపల్లికి చెందిన శ్రీలేఖ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా గడుపుతున్న ఆ జంటపై విధి కన్నెర్ర చేసింది. రాజంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్సు హరికృష్ణ (21) మృతి చెందగా, శ్రీలేఖ గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

News March 27, 2024

మైదుకూరు: గుండెపోటుతో మహిళ మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన షేక్ భాను(37) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మూడు రోజుల నుంచి తాగు నీటి ట్యాంకర్ రాకపోవడంతో పక్కన వీధిలో నీటి ట్యాంకర్ నుంచి అతి కష్టం మీద బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కోసం ఎక్కువ టెన్షన్ పడడం వల్లే గుండెపోటుకు గురైందని వాపోతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News March 27, 2024

ఎర్రగుంట్ల: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఎర్రగుంట్ల వద్ద రైలు కింద పడి బుధవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సమస్యల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. మృతుడు పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్‌ వాసిగా పోలీసులు గుర్తించారు.

News March 27, 2024

రాజంపేట హైవే ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజంపేట-తిరుపతి జాతీయ రహదారి పైన బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన <<12933916>>విషయం తెలిసిందే.<<>> ఊటుకూరు సమీపంలోని అశోకా గార్డెన్స్ వద్ద లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిట్వేలి మండలం, వడ్డిపల్లెకు చెందిన యువకుడు హరి మృతి చెందగా, శ్రీలేఖ చికిత్స పొందుతుంది. ప్రమాదానికి గురైన వీరికి మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. ఘటనపై పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ప్రొద్దుటూరు: మహిళా వాలంటీర్ సూసైడ్

image

ప్రొద్దుటూరు పట్టణంలోని టీబి రోడ్డులోని తేజస్విని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మూడో సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న తేజస్వినికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనారోగ్య సమస్యలతోనే తేజస్విని మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 27, 2024

కడప, అన్నమయ్య జిల్లాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎన్నంటే

image

కడప జిల్లాలో 513, అన్నమయ్య జిల్లాలో 400 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌ విజయరావు తెలిపారు. అక్కడ ఆర్మూర్‌ రిజర్వుడ్‌ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రత్యేక రూటు ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఒక వాహనంతో పాటు ఐదుగురు సిబ్బంది ఉంటారని స్పష్టం చేశారు.

News March 27, 2024

కమలాపురం నియోజకవర్గంలో TDPకి షాక్

image

కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

News March 27, 2024

కడప: ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

image

ఎన్నికల ప్రచార కార్యకలాపాలు చేపట్టాలనుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.

News March 26, 2024

రాజుపాలెం: గడ్డివామి దగ్ధం.. రూ.లక్ష నష్టం

image

రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.