India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కడప జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు భద్రతపై సిబ్బందితో చర్చించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 4 వరకు బందోబస్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
మైదుకూరు మండల పరిధిలోని కేశలింగయ్య పల్లె వద్ద సోమవారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన సుంకర కొండయ్య(55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చిట్వేలిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కొద్ది గంటల క్రితం ఓ కారు, బైక్‌ను<<13327396>> ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిట్వేలి పోలీసులు విచారణ చేపట్టారు.
వైవీయూ పరిధిలోని ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బీటెక్ 4వ సంవత్సరం 2వ సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను వైవీయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నాగరాజు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి విడుదల చేశారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు కడప జిల్లాలో 16 సెంటర్లలో మొత్తం 247 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యా శాఖ అధికారి అనురాధ తెలిపారు. 615 విద్యార్థులకు గాను 368 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. 40.16% హాజరు కాగా, గైర్హాజరు శాతం 59.84% ఉందన్నారు. 02 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 08 సెంటర్లను పరిశీలించారన్నారు.
ఎర్రగుంట్ల మండల పరిధిలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి రాణివనం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండలం, రాణివనంకు చెందిన ఆరీఫ్ తన తల్లితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరీఫ్ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఆరీఫ్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ఎందరో పర్యాటకులను మనవైపు చూసేలా చేసింది మన గండికోట. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు, మూడు వైపుల పెన్నా నది లోయ, అబ్బుర పరిచే శిల్ప సంపద, రాజులు, రాజ్యాల వైభవం గండికోట సొంతం. వర్షాలు పడేకొద్దీ గండికోట అందాలు మరింత ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం కొద్ది వర్షపాతానికే గండికోట పరిసర ప్రాంతాలు పచ్చగా మారాయి. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
కడపలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేపై దాడి, కడప, మైదుకూరులో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కడప రిమ్స్ సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పారా మిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు. మూడెంచెల భద్రతతో, 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను డీజీపీ నియమించారు.
చిన్నమండెం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరిఫుల్లా రైస్ మిల్లు ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నరసింహులును ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.