India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామని టార్గెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. రాయచోటిలోని పీసీ ఆర్ గ్రాండ్లో టార్గెట్ బాల్ అసోసియేషన్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోవు విద్యా సంవత్సరంలో సీనియర్స్ విభాగం టోర్నీ కృష్ణా, జూనియర్ విభాగం అనంతపూర్‌లో, సబ్ జూనియర్ పోటీలు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో రాయచోటి ఉపాధ్యాయుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మియాపూర్ ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
లింగాల మండలం ఇప్పట్ల గ్రామం దగ్గర పులివెందుల వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఆదివారం ఢీకొని ఒకరు మృతి చందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సింహాద్రిపురం మండలం బిదినంచెర్లను చెందిన నారాయణరెడ్డిగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి లింగాల మండలం బోనాలకు చెందిన రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
పెండ్లిమర్రి మండల పరిధిలోని చీమలపెంట వద్ద వేంపల్లి నుంచి కడప వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసులు, మశయ్య, సుబ్బమ్మ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. వీరంతా రంపతాడు గ్రామ స్థానికులు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో ఆటో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.
ముద్దనూరు రైల్వే స్టేషన్లో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో గొడపడ్డారు. ఈ క్రమంలో ఒకరు బండరాయితో దాడిచేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి ముద్దనూరు సివిల్ పోలీసులు, ఎర్రగుంట్ల రైల్వే సీఐ చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య అధికంగా ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినవారు మొట్టమొదటిగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని శనివారం మున్సిపాలిటీ ప్రజలు ఓ ప్రకటనలో విన్నవించారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులలో ఎవరు గెలిచినా నీటి సమస్యపై దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరారు.
కమలాపురం చెరువు కట్టపై వెలసిన వజ్రాల సుంకులమ్మ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన పాల పళ్ల విభాగం ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు ప్రథమ బహుమతి రూ.60 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలా వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కడప జిల్లాలో ఓటింగ్ శాతం పెరగింది. దీంతో పాటు క్రాస్ ఓటింగ్ కూడా పడిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలో షర్మిల ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చాయి. ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు ఇంకోపార్టీకి వేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఎవరికి మేలు, ఎవరికి కీడు జరిగిందో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
కడప – రాయచోటి రహదారిలోని గువ్వల చెరువు ఘాట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 1200 బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయి. పాండిచ్చేరి నుంచి రాయపూర్‌కు బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Sorry, no posts matched your criteria.