India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన పేరిట ఉన్న ఆస్తి కోసం సొంత కోడలు కిడ్నాప్ చేసిందని రాజంపేటకు చెందిన లక్ష్మి నరసమ్మను చెప్పుకొచ్చారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మన్నూరుకు చెందిన తనను తన కోడలు రేవతి వారం రోజుల కిందట కిడ్నాప్ చేసి రాయచోటికి తీసుకెళ్లిందని వాపోయింది. ఆస్తి కోసం ఆమెను ఇబ్బందులు పెట్టారని, ఏకంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపారని శనివారం జరిగిన పత్రికా సమావేశంలో వివరించింది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1035 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో జేసీ గణేష్ కుమార్, జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షకులు ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదమని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నింబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ గోపద, జంతుబలులు నిషేద చట్టం 1977 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. దీనికి సంబంధించిన ఏదైన సమాచారం వుంటే జిల్లా నోడల్ ఆఫీసర్ దిశ డీఎస్పీకి అందించాలని కోరారు.
రాజంపేట ఆకులవీధిలోని నివాసం ఉంటున్న రామాయణం అంజి శుక్రవారం రాత్రి మిద్దె పైనుంచి పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
ఎన్నికలకు అనుబంధంగా విధులు నిర్వహించడానికి కడప, అన్నమయ్య జిల్లాలలో మరికొంత మంది అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రైల్వేస్ డిఎస్పీ బి.మోహన్ రావు, సీఐడి డిఎస్పీ భాస్కర్ రావులను అన్నమయ్య జిల్లాలో నియమించారు. ఏసీపీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఏసీపీ డీఎస్పీ ఎన్ సత్యానందంలను కడప జిల్లాలో నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని బద్వేల్ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన మురళీ కృష్ణ ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీవరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి వైవీయూకు బంగారు పతకం అందించారు. శనివారం ఉదయం మురళి కృష్ణను యూనివర్సిటీకి పిలిపించి వీసీ చింత సుధాకర్, అధ్యాపకులు సత్కరించారు.
జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడులో గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో దొంగతనం జరిగింది. బాదితులు పెద్ద ఓబులేసు, భార్య గురుదేవి మాట్లాడుతూ.. రాత్రి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో బీరువా తీసి 13 తులాల బంగారు, రూ.50 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. అలాగే పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒంటిమిట్టలో హరిత శోభ కోసం TTD అధికారులు ప్రణాళిక రూపొందించారు. కోదండ రామాలయం పరిసర ప్రాంతాలు, కాలిబాటలు, సీతారాముల కళ్యాణ వేదిక, శృంగిశైలం, నాగేటి తిప్పపై పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం DFO శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, హరికృష్ణల ఆధ్వర్యంలో అధికారుల బృంద సభ్యులు ఇక్కడికి వచ్చారు. నీడ, ఆహ్లాదం పెంచే మొక్కలు నాటి సంరక్షించాలని చర్చించారు.
ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్కు సంబంధించి విద్యార్థులు నిర్ణీత షెడ్యూల్ మేరకు ధ్రువపత్రాల పరిశీలనకు తమ దగ్గర్లోని హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాలో కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్, రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను హెల్ప్ లైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.