Y.S.R. Cuddapah

News May 25, 2024

26న కడపలో అండర్ 16 పురుషుల క్రికెట్ ఎంపికలు

image

మే 26 ఉదయం 7 గంటలకు కడపలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో U-16 పురుషుల క్రికెట్ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్, కిట్ బ్యాగు తప్పక తీసుకురావాలని తెలిపారు. 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు31 మధ్య జన్మించి ఉండాలి.

News May 24, 2024

రేపు ఒంటిమిట్టలో తిరుమల లడ్డు విక్రయం

image

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో నాలుగో శనివారం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టిటిడి ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

News May 24, 2024

రాయచోటి: పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 25 నుంచి జూన్ 2 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. మే 27 నుంచి జూన్ 3 వరకు సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాలు పరిశీలిస్తారన్నారు. మే 31 నుంచి జూన్ 5 వరకు కేంద్రాల ఎంపిక, మార్పులు జరుగుతాయన్నారు.

News May 24, 2024

కోడూరు: బైకు, లారీ ఢీ.. ఒకరు మృతి

image

రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని అప్పరాజుపేట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెనగలూరు మండలం కొండూరుకు చెందిన పసుపులేటి సుబ్బ నరసయ్య మృతి చెందగా, తోట వెంకటరమణ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 24, 2024

అంతర్జాతీయ పోటీలకు కడప జిల్లా వాసి

image

ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బి. శివ శంకర్ రెడ్డి ఎంపికయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 1వ ఫెడరేషన్ కప్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్- 2024లో 45 ప్లస్ వయో విభాగంలో ఈయన 3 స్వర్ణ పతకాలు సాధించారు.
ALL THE BEST SIR

News May 24, 2024

కడప: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం: కలెక్టర్

image

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

News May 23, 2024

కడప: చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్

image

చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నల్లపు అంజీ అనే నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నరసింహ, ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

కోడూరు: బైకును ఢీకొన్న ట్రాక్టర్.. యువకుడు మృతి

image

చిట్వేలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిట్వేలి నుంచి గరుగుపల్లికి వెళ్లే రహదారిలో సాయిబాబా గుడి వద్ద ట్రాక్టర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైలపల్లి హరిజనవాడకు చెందిన కేతరాజుపల్లి చందు కిషోర్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 23, 2024

కడప: మంత్రి పదవి వరించని నియోజకవర్గాలు ఇవే

image

కడప జిల్లాలో ఇప్పటి వరకు MLAలుగా గెలిచి మంత్రి పదవులు పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయచోటి MLAల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఎక్కువగా కడప నియోజకవర్గ MLAలకు మంత్రి పదవులు దక్కాయి. కడప నుంచి ఆరుగురికి, జమ్మలమడుగు, పులివెందుల నుంచి ముగ్గురికి, రాజంపేటలో ఇద్దరికి, కోడూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నుంచి ఒక్కొక్కరికి పదవులు దక్కాయి. ఈ సారి ఎవరికి వరిస్తుందో కామెంట్ చేయండి.