Y.S.R. Cuddapah

News May 23, 2024

కడప: ఎన్నికల కౌంటింగ్.. చివరి ఫలితం ఇక్కడే

image

జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

News May 23, 2024

కడప: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

image

వీరపునాయునిపల్లె మండలం బసిరెడ్డిపల్లెకు చెందిన హర్షిత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై వివరాల మేరకు.. హర్షితను పోరుమామిళ్ల మండలం కల్వకుంట్లకు చెందిన క్రాంతి కిరణ్ ప్రేమిస్తున్నానంటూ ఫోన్ చేసి మానసికంగా వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం పురుగుమందు తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు తిరుపతి స్విమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వెంకటరెడ్డి తెలిపారు.

News May 23, 2024

కడప: ఆ కాలేజ్‌కు వైవీయు గుర్తింపు లేదు

image

ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఉన్న శ్రీ మలయాళ స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి వరకు వైవీయు నుంచి ఎలాంటి గుర్తింపు లేదని విశ్వవిద్యాలయ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య కె. రఘుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కళాశాలలో బీఈడీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు.

News May 23, 2024

రాజంపేట: అల్లరిమూకల అణచివేతకు ప్రత్యేక బృందాలు

image

అసలే ఎన్నికల వాతావరణం.. ఓట్ల లెక్కింపు అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు కార్డెన్ సెర్చ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులందరూ రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతిభద్రతలకు అఘాతం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

News May 22, 2024

అప్పుల బాధ ఎక్కువై యువ రైతు ఆత్మహత్య

image

బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.

News May 22, 2024

కడప: రైలు కింద పడి యువకుడు సూసైడ్

image

వల్లూరు మండలం తొల్లగంగనపల్లి సమీపంలో రైలు కింద పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకి మల్లికార్జున (17) రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితమే మల్లికార్జున తల్లిదండ్రులు మరణించారు.

News May 22, 2024

కడప: ‘విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని TNSF కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.

News May 22, 2024

కడప: మొదటి కౌంటింగ్ కమలాపురం నుంచే?

image

జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

News May 22, 2024

కడప : గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం

image

సివిల్స్, ఐఐటీ, నీట్ వంటి ఉన్నత చదువుల కోసం గ్రామీణ విద్యార్థులకు తమవంతు సహకారం అందిస్తామని పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈనెల 26న 6నుంచి10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.00 గంటలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

News May 22, 2024

రాయచోటి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాయచోటిలోని జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిటెండెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. ఈనెల 24 నుంచి జూన్ 1వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.