India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నమయ్య జిల్లాలోని మూడు ప్రభుత్వ ఐటీఐలు, 12 ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు జూన్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కే. శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలలో 392 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 1064 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం తిమ్మయ్యగారి పల్లికి చెందిన ఓబిలి నరసింహులు(47) కువైట్‌లో 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని విమానం ద్వారా మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేవీపీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఓబిలి పెంచలయ్య మృతునికి స్వయాన సోదరుడు.
వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ యం.అభిషిక్త్ కిషోర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో రాయచోటి, సుండుపల్లె తంబళ్లపల్లె, పెద్దమండెం, బీ.కొత్తకోట, రామసముద్రం, పీలేరు నియోజకవర్గాలలో 13 మండలాలలో తాగునీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్ నగర్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్లు
పేర్కొన్నారు.
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం మలినేని పట్నం సమీపంలో కడప-చైన్నై ప్రధాన రహదారిపై మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బద్వేల్ నుంచి కడపకు వెళ్తున్న బస్సును.. తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతింది. సంఘటనా స్థలానికి ఎస్సై పెద్ద ఓబన్న చేరుకోని విచారిస్తున్నారు.
సిద్ధవటం మండలంలోని మిట్టపల్లిలో పిడుగుపాటుకు గులక రాళ్లు తగిలి కాడే వెంకటస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో మిట్టపల్లి దేవాలయం ఎదురుగా ఉన్న పాత నీటి ట్యాంకు బేస్ మీద పిడుగు పడింది. దీంతో 20 మీటర్ల దూరంలో ఉన్న వెంకటస్వామికి గులక రాళ్లు తగిలి గాయాలయ్యాయి.
జిల్లాలోని బద్వేల్ పరిధిలోని కొంగలవీడుకు చెందిన జి. జ్యోతి (18) కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోందని, ఈనెల 19న బయటికి వెళ్లి తిరిగిరాలేదని ఆమె తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోపయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలియజేశారు.
కడప గౌస్‌నగర్‌లో జరిగిన అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ వర్గాలకు సంబంధించిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డిపై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఒకవైపు ఐపీఎల్, మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిపై జిల్లాలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనంతగా ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం ఎవరు అవుతారు, వచ్చే మోజార్టీ ఎంత, ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు గెలుస్తారు..? ఇలా పలు అంశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. ధనమే కాకుండా ఇళ్లులు, భూములు సైతం పందేల్లో పెడుతున్నారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రొద్దుటూరు నియోజకవర్గ కౌంటింగ్‌కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్త్ ఏర్పాట్లపై స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు.
Sorry, no posts matched your criteria.