India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో అత్యాచార ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. కడపకు చెందిన ఓ యువతి HYD మియాపూర్‌లో రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనీగా పనిచేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ సైట్ చూపిస్తామంటూ ఆమెను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. తప్పించుకున్న యువతి ఉప్పల్ PSలో ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి మియాపూర్ PSకు కేసును బదిలీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్‌గా ఉన్న రంగయ్య పరిస్థితి బుధవారం విషమించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. వివేకానంద హత్య కేసులో ఈయన్ను గతంలో సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
వైవీయూ పరిధిలో 4వ తేదీన జరగాల్సిన పీజీ 4వ సెమిస్టర్, డిగ్రీ 7వ సెమిస్టర్, ఇంజినీరింగ్, ఎంసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఈశ్వరరెడ్డి తెలిపారు. విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్.రఘునాథ రెడ్డి సూచనలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీని తమ కళాశాలలో తెలుసుకోవాలన్నారు.
ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో మంగళవారం రాత్రి 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐచర్ వాహనంలో పరదాల చాటున రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని పట్టుకొని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు నాలుగువేల కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లె వాసి మల్లికార్జున రెడ్డి (35) వేయినూతలకోనలో ఉరి వేసుకుని చనిపోయినట్టు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. ఈయన మూడు రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి గతంలో చనిపోగా ప్రస్తుతం ఆయన తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కమలాపురం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప-విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో ప్లాట్‌ఫారం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.
కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో ఆయన రాష్ట్ర మంత్రులతో కలిసి తన నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయనపై వైసీపీ నేతలు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఆయనను అనర్హుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానానికి నామినేషన్ వేశారు.
Sorry, no posts matched your criteria.