India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒంటిమిట్టలో హరిత శోభ కోసం TTD అధికారులు ప్రణాళిక రూపొందించారు. కోదండ రామాలయం పరిసర ప్రాంతాలు, కాలిబాటలు, సీతారాముల కళ్యాణ వేదిక, శృంగిశైలం, నాగేటి తిప్పపై పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం DFO శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, హరికృష్ణల ఆధ్వర్యంలో అధికారుల బృంద సభ్యులు ఇక్కడికి వచ్చారు. నీడ, ఆహ్లాదం పెంచే మొక్కలు నాటి సంరక్షించాలని చర్చించారు.
ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి విద్యార్థులు నిర్ణీత షెడ్యూల్ మేరకు ధ్రువపత్రాల పరిశీలనకు తమ దగ్గర్లోని హెల్ప్ లైన్ సెంటర్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాలో కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్, రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను హెల్ప్ లైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు.
మే 26 ఉదయం 7 గంటలకు కడపలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో U-16 పురుషుల క్రికెట్ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్, కిట్ బ్యాగు తప్పక తీసుకురావాలని తెలిపారు. 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు31 మధ్య జన్మించి ఉండాలి.
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో నాలుగో శనివారం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టిటిడి ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 25 నుంచి జూన్ 2 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. మే 27 నుంచి జూన్ 3 వరకు సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాలు పరిశీలిస్తారన్నారు. మే 31 నుంచి జూన్ 5 వరకు కేంద్రాల ఎంపిక, మార్పులు జరుగుతాయన్నారు.
రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని అప్పరాజుపేట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెనగలూరు మండలం కొండూరుకు చెందిన పసుపులేటి సుబ్బ నరసయ్య మృతి చెందగా, తోట వెంకటరమణ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బి. శివ శంకర్ రెడ్డి ఎంపికయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 1వ ఫెడరేషన్ కప్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్- 2024లో 45 ప్లస్ వయో విభాగంలో ఈయన 3 స్వర్ణ పతకాలు సాధించారు.
ALL THE BEST SIR
కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.
కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.