Y.S.R. Cuddapah

News July 25, 2024

ప్రొద్దుటూరు: 31న పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

image

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎంవీసీహెచ్ జగదీశ్వరుడు తెలిపారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి పాసై ఆసక్తి గల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని కోరారు.

News July 25, 2024

కడప: బయోటెక్నాలజీలో షేక్ సమీనకు YVU డాక్టరేట్

image

YVU బయోటెక్నాలజీ శాఖ స్కాలర్ షేక్ సమీనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎ. చంద్రశేఖర్ పర్యవేక్షణలో “నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగించి, కొర్రలలో దిగుబడిని పెంచేందుకు రికాంభినెంట్ ఇనెబ్రీడ్ లైన్స్ని అభివృద్ధి చేశారు. ఈ రీసెర్చ్ భారతదేశంలో మొదట ఆధునిక జీనోమ్ ఆధారిత పరిశోధన కావడం విశేషం. ఈ పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ సీఈ ప్రొ. ఎన్. ఈశ్వర రెడ్డి తెలిపారు.

News July 25, 2024

గన్ మెన్లను తిరస్కరించిన కడప ఎమ్మెల్యే

image

తనకు కనీస సమాచారం ఇవ్వకుండా 2+2 గన్ మెన్లను 1+1కు కుదించడంపై కడప ఎమ్మెల్యే మాదవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పైగా తన భర్త శ్రీనివాసులురెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటూ వారిని పంపించేశారు. సెక్యూరిటీని కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఖండించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లారు.

News July 25, 2024

‘కడప RIMSకు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు’

image

పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. CKదిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్‌కు పరిచయం ఏర్పడి ఫోన్ పే ద్వారా రూ.20 వేలు చెల్లించారు. తన డబ్బులు అడగ్గా ఇవ్వనని, అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని RMO తెలిపారు.

News July 25, 2024

అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ గా బద్వేలు MLA

image

బద్వేలు MLAగా రెండో సారి ఎన్నికైన డాక్టర్ దాసరి సుధను ప్యానెల్ స్పీకర్‌గా నియమించడం జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈమెతో పాటు వరద రాజులరెడ్డిని కూడా నియమించారు. 2024 ఎన్నికల్లో BJP అభ్యర్థిపై 20వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. అంతకుముందు భర్త మరణించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సుధ ఉపఎన్నికల్లో 90 వేలు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. అటు BJP విప్‌గా ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు.

News July 25, 2024

కడప: మంత్రి ఫోన్ చేస్తే ఎవరు అంటూ ప్రశ్న.. అధికారిపై వేటు

image

RTC కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరావుపై బదిలీ వేటు పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించినా ఈడీ పట్టించుకోలేదు. మంత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోగా, తరువాత ఎవరంటూ ఎదురు ప్రశ్నించారని అన్నారు. ఈడీ YCP నేతలకు అనుకూలంగా ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై పలు ఫిర్యాదులు రాగా, ఈడీ పోస్టు నుంచి తప్పించారు.

News July 25, 2024

కడప RIMSలో నిఫా వైరస్‌కు ప్రత్యేక వార్డు

image

కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఐపీ విభాగంలో ‘నిఫా వైరస్’ బాధితుల కోసం 10 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయగా, బుధవారం దీనిని ప్రారంభించారు. ఎవరైనా ఈ తరహా వైరస్‌తో బాధపడుతూ వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స చేసేందుకు ఈ వార్డును ఉపయోగించుకోవచ్చని రిమ్స్ ఆర్ఎంఓ వై.శ్రీనివాసులు తెలియజేశారు. ఈ వైరస్‌తో బాధపడేవారికి మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.

News July 25, 2024

అన్నమాచార్య కళాశాల అధ్యాపకునికి డాక్టరేట్

image

రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న అల్లూరయ్యకు వేలూరు విఐటి యూనివర్సిటీ వారు పీహెచ్డీ ప్రదానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ తెలిపారు. తాను చేసిన పరిశోధన వల్ల హైబ్రిడ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్ ద్వారా తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ ఇవ్వవచ్చని డాక్టర్ అల్లూరయ్య తెలిపారు. డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక బృందం అల్లూరయ్యను అభినందించారు.

News July 25, 2024

కడప: 27 లోపు వివరాలను నమోదు చేయాలి

image

వైవీయూలోని అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్‌ అందరికీ, డిగ్రీ 2023-24 సంవత్సరాలకు సంబంధించిన II, IV సెమిస్టర్‌ల EDX కోర్సు వివరాలను 27వ తేదీలోపు నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. హార్డ్ కాపీని పరీక్షా శాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇప్పటికే YVUకు హార్డ్ కాపీలు పంపిన వారు మళ్లీ పంపవద్దని సూచించారు.

News July 24, 2024

కడప: బాలికపై అత్యాచారం.. నిందితుడికి రూ.3 వేలు జరిమానా

image

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన కేసులో బాలుడికి రూ.3 వేల జరిమానా, 2 ఏళ్లపాటు అబ్జర్వేషన్ హోంకు పంపుతూ కడప జువైనల్ జస్టిస్ బోర్డ్ జడ్జి నందిని మంగళవారం తీర్పు చెప్పారు. 2021 ఆగస్టు 12న చక్రాయపేట లో 9 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.