India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు గాంధీ రోడ్డులో స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడి వారిని ప్రశ్నించారు. దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు.
ప్రజల సమస్యలపై విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జులై 1న ఉదయం 10.00గం.ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
YSRTUC ట్రేడ్ యూనియన్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కడప రసూల్ బాషా తెలిపారు. వైసీపీలో తాను గత 13 సంవత్సరాలుగా ఉన్నానని, సొంత కారణాలవల్ల YSRCP నుంచి వైదొలుగుతున్నట్లు ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, మరో పార్టీ నుంచి ఒత్తిడి గాని లేదని ఆయన ప్రకటించారు. ఇక పార్టీ కార్యక్రమాలు తాను చేయదలచుకోలేదని తెలిపారు.
తాను బతికున్నంత కాలం నిజాయితీగా బతికి చనిపోతానని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు గీతాశ్రమంలో విశ్వహిందూ పరిషత్, ABVP, RSS, శివ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అభినందన సభ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తామన్నారు. దేవాలయాల ఆస్తులను కాపాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు రాజీ పడకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
సిద్దవటం మండలం వెలుగు పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతున్నట్లు కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త కథలు అవాస్తవమని సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి అన్నారు. ప్రతిరోజు మా సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా అన్నీ గమనిస్తున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. చిరుత తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కళావతి అన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్, పింఛన్ల పంపిణీతో సీఎం చంద్రబాబు మోసాలు మొదలయ్యాయని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. 50 వేల టీచర్ పోస్టులకు కేవలం 16 వేల పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. దివ్యాంగులకు పెంచిన పింఛన్ 3 నెలలకు కలిపి ఇవ్వకుండా వారిని మోసం చేస్తున్నారన్నారు. ప్రజల తరఫున తాము శాంతియుత పోరాటం చేస్తామన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2వ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ మైనాటీల ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.జ్ఞానకుమార్ తెలిపారు. విద్యార్థులు 10వ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు కూడా అడ్మిషన్లను పొందవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ అప్లికేషను ఆన్లైన్ ద్వారా iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
రాజంపేట అదనపు DMHO చెన్నకృష్ణ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ముఖం చాటేశాడని ఓ స్టాఫ్ నర్సు ఆరోపించారు. కమలాపురం ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో చెన్నకృష్ణ పరిచయమయ్యాడని, తనను రెండో భార్యగా చేసుకుంటానని నమ్మించాడన్నారు. 2013లో పెళ్లి చేసుకుని, కడపలో కాపురముండేవాళ్లమని, 5 నెలలుగా పట్టించుకోలేదని తనకు న్యాయం చేయాలన్నారు. దీనిపై చెన్నకృష్ణ స్పందిస్తూ ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కడప నగరంలోని శారదా నిలయం సమీపంలో శుక్రవారం రాత్రి నబీ రసూల్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నబీ రసూల్ మామ చాన్, అతని కుమారుడు జంక్సాన్ వలి ఎందుకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో నబీ రసూల్ వారిపై కత్తితో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అతిసార వ్యాధి నిర్మూలనకు పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరాలే కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం అతిసార వ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమం- 2024 పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసిడిఎస్, మునిసిపల్ అధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.