Y.S.R. Cuddapah

News June 29, 2024

యోగివేమన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

YVU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ రాజీనామాకు VC ఆమోదం తెలిపారు. అనంతరం YVU వీసీ ఆచార్య సుధాకర్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి పంపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా YVU ప్రిన్సిపల్ రఘునాథరెడ్డికి వారు నియామక పత్రం అందజేశారు.

News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

News June 29, 2024

పులివెందుల: యువకుడు MISSING

image

పులివెందుల పట్టణంలోని బేతేలు చర్చి వీధికి చెందిన ఆదాం(16) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి యూసుఫ్ కథనం మేరకు.. ఈ నెల 27న ఉదయం స్థానిక గోపీ విహార్ వీధిలోని ఎలక్ట్రికల్ షాపులో పనిచేసేందుకు వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి యూసుఫ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

News June 29, 2024

రాయచోటి: నా ఇల్లు నాకు ఇప్పించండని మహిళ ఆవేదన

image

అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన వికలాంగురాలు షాహిదా ఇంటిని ఓ వ్యక్తి అద్దెకి తీసుకొని రిజిస్టర్ చేయించుకొని తనని బయటకు గెంటేశాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై బాధితురాలు చాలా రోజుల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసింది. జాయింట్ కలెక్టర్ ఫర్ మాన్ అహ్మద్ విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News June 29, 2024

బద్వేల్: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ

image

ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ఇటీవల పట్టుబడిన ఎర్ర చందనం కేసులో బద్వేలు అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్, అట్లూరు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 29, 2024

ప్రొద్దుటూరు: ‘విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి’

image

విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యునాని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. 260 మంది విద్యార్థులకు వ్యాధి నిరోధక హోమియో మందులను ఇచ్చారు.

News June 28, 2024

కడప: BSNL సేవల్లో అంతరాయం

image

కడప జిల్లాలో శుక్రవారం BSNL సేవల్లో అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఏడు గంటల వరకు BSNL నెట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు BSNL కార్యాలయాల వద్దకు పరుగులు తీశారు. మెయిన్ లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని వారు వివరించారు. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి వద్ద ఉన్న టవర్ గత మూడు రోజులగా పని చేయడం లేదని కూడా వారు ఫిర్యాదు చేశారు.

News June 28, 2024

పెండ్లిమర్రి : బత్తిన అశోక్‌కు వైవీయూ డాక్టరేట్

image

YVU కామర్స్ విభాగ పరిశోధకుడు బత్తిన అశోక్‌కు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. పర్ఫార్మెన్స్ అనాలసిస్ ఆఫ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ELSS) అనే అంశం పైన పరిశోధన చేసి రూపొందించిన సిద్ధాంత గ్రంథాన్ని అశోక్ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగానికి సమర్పించారు. అశోక్‌కు డాక్టర్ ప్రొసీడింగ్స్‌ను డాక్టర్ నల్లపురెడ్డి ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.

News June 28, 2024

కడప జిల్లా మీదుగా నడుస్తున్న రైళ్ల గడువు పొడిగింపు

image

జిల్లా మీదుగా నడుస్తున్న అహ్మదాబాద్-తిరుచునాపల్లి, మధురై -ఓకా రైళ్ల గడువును పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి తిరుచునాపల్లికి వెళ్లే రైలును సెప్టెంబర్ 26వరకు, తిరుచునాపల్లి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే రైలును సెప్టెంబర్ 29 వరకు, ఓకా, మధురై మధ్య నడుస్తున్న రైలు గడువును సెప్టెంబర్ 30 వరకు, మధురై- ఓకా రైలును అక్టోబర్ 4 వరకు పొడిగించారు.