India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కడప జిల్లాకు చెందిన MLAలు జిల్లాలోని సమస్యలపై తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు దృష్టి సారించాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన పాపాగ్ని వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలి. మరి మీ ఎమ్మెల్యే ఏ అంశంపై గళం విప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అభాసుపాలు చేసి తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఇదే కొనసాగితే ఐదు నెలల్లో కూటమి కుప్ప కూలక తప్పదని జోస్యం చెప్పారు. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దయనీయంగా ఉండటం కలవరపాటుకు గురి చేసిందన్నారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ IIIT గ్రంథాలయం వేదికగా IIIT 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు జులై 22, 23వ తేదీలలో ఆర్కేవ్యాలీ IIIT, 24, 25 తేదీలలో ఒంగోలు IIIT అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు సోమవారం ధ్రువపత్రాలు పరిశీలించి అడ్మిషన్లు కల్పించనున్నారు.
చారిత్రక నిర్మాణమైన గండికోటకు ప్రపంచస్థాయి పర్యాటక శోభను తీసుకొస్తామని కలెక్టర్ లోతేటి శివ శంకర్ అన్నారు. ఆదివారం గండికోటను ఆర్డీవో శ్రీనివాసులు, స్వదేశీ దర్శన్ 2.0 ప్రాజెక్టు అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. మొదటగా గండికోటలోని జుమా మసీదును పరిశీలించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సభ్యులు గండికోట విశేషాలు తెలియజేశారు.
కడప నగరంలోని డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం పాత ఆర్జేడిపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగించేలా ఐదుగురు ఘర్షణకు దిగి దాడి చేసి తన సెల్ఫోన్ పగలగొట్టారని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుండుపల్లి ఎంఈవో వెంకటేశ్ నాయక్, ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, నాగమణి రెడ్డి, శివకుమార్ రెడ్డి, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.
కడప నగరంలో ఓ యువకుడు ఓవర్ స్పీడ్ కారణంగా తనకు గాయమైనట్లు 1 టౌన్ ఎస్సై మధుసూదన్ తెలిపారు. శనివారం సాయంత్రం రాజీవ్ పార్క్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన సమయంలో ఓ యువకుడు వేగంతో వచ్చిన బైక్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన చేయి విరిగిందని ఎస్సై చెప్పుకొచ్చారు. కానీ.. బైక్ ఆపలేదనే నెపంతో తనను ఎస్సై కొట్టాడని ఆ <<13672081>>యువకుడు<<>> తెలిపిన విషయం తెలిసిందే.
మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని కోపంతో బ్లేడుతో తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన కడపలో జరిగింది. నగరంలోని రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న కొండమ్మపై అమె కుమారుడు రాకేశ్ శనివారం బ్లేడుతో దాడి చేశాడు. తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆమె కుమారుడు తల్లిపై బ్లేడుతో దాడి చేయడంతో ఆమె చేతికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కడప కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులు, రైల్వేలైన్ల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా అదితిసింగ్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నూతన జేసీగా 2020 బ్యాచ్‌కు చెందిన అదితి సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. త్వరలో ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రెండేళ్ల పాటు నగరపాలక సంస్థ కమిషనర్‌గా సూర్య సాయి ప్రవీణ్ కడపలో పనిచేశారు.
Sorry, no posts matched your criteria.