India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏప్రిల్ రెండవ తేదీన కడప జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడపలో తెలిపారు. 28వ తేదీ కడపలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడగా.. ఏప్రిల్ 2న కడపలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొనడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.
ఉమ్మడి కడప జిల్లాలో TDP వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు సీటు దక్కని నేతలు బహిర్గతంగానే పార్టీపై విమర్శలు చేశారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు నాయకులు ఆ కోవలోనే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు వారు ఎంతవరకు సహకరిస్తారో అని చర్చ ఉంది. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టింది.
జిల్లా రాజకీయాల్లో కడప అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 3 దశాబ్దాల నుంచి ముస్లింలకు కంచుకోటగా మారిన కడప నుంచి సిట్టింగ్ MLA అంజాద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇటు కూటమి నుంచి మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. కడపలో గెలిచి చరిత్ర సృష్టిస్తానని మాధవిరెడ్డి అంటుంటే, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిది.?
జమ్మలమడుగు మండలం, గొరిగేనూరులో తడి బట్టతో ఇంట్లో బండలు తుడుస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన రామసుబ్బమ్మ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఇంట్లో గత కొన్నేళ్లుగా ఇంటి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో తడిబట్టలతో బండలు తుడుస్తూ మరో చేత స్విచ్ బోర్డు పట్టుకున్నది. విద్యుత్ సరఫరా అవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు భూపేశ్ రెడ్డి గురించి మాట్లాడారు. ‘బుల్లెట్ లాంటి కుర్రాడు, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, జమ్మలమడుగు TDPకి ఎవరూ లేనప్పుడు పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. పార్టీని నమ్ముకున్నాడు కాబట్టే MP టికెట్ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. భూపేశ్‌కు ప్రత్యర్థిగా వివేకాను హత్య చేసిన వ్యక్తి ఉన్నాడని ఆరోపించారు. భూపేశ్‌ని గెలిపిస్తే కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుందని హామీ ఇచ్చారు.
ట్రాక్టర్ బోల్తా పడి లింగాలకు చెందిన జయరామిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈతాకుల కోసం ట్రాక్టర్‌లో వెళ్లాడు. తిరుగు పయణంలో అంబకపల్లి మురారిజింతల గ్రామ సరిహద్దుల్లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర విలపిస్తున్నారు.
చంద్రబాబు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఉక్కు ప్రవీణ్ గురించి ప్రస్తావించారు. పార్టీ కోసం ప్రవీణ్ చాలా కష్టపడ్డాడని, రెండు సార్లు జైలుకు వెళ్లాడని అతడికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీఎం సురేశ్ పార్టీకి సహకరించారని. ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోయా తప్పకుండా అతనికి న్యాయం చేస్తానన్నారు. లింగారెడ్డి, ఇతర నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
కాశినాయన మండలం నరసాపురం సచివాలయం పరిధిలోని 23 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో నరసాపురం, మిద్దెల, మూలపల్లి, నరసన్నపల్లి గ్రామాల వాలంటీర్లు ఉన్నారు. తామంతా వైసీపీ గెలుపు కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు తెలిపారు.
ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు గుప్పించారు. రాచమల్లు ఒక ముళ్లు అని ప్రజలను గుచ్చుతూనే ఉంటారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, ఇసుక, సెటిల్ మెంట్ లో, నకిలీ నోట్లు ఇలా అన్నింటిలో అవినీతిలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. రాజమల్లు రూ.2 వేల కోట్లు అవినీతితో సంపాదించారని ఆరోపించారు.
రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన నొస్సం బాబుషా (17) అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నొస్సం సంజీవ్ భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సాగు నీరు పారించేందుకు కుమారుడు బాబుషా అక్కడికి వెళ్లాడు. నీటిని విడిచే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాబుషా అక్కడికక్కడే మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.