India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో కలిపి మూడు రోజులు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉండటంతో సీఎం జగన్ సుడిగాలి ప్రదర్శన చేపట్టారు. దానిలో భాగంగానే నేడు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ రాజంపేటకు రానున్నారు. రైల్వేకోడూరు రోడ్డులో ఎన్నికల ప్రచార సభ ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. దీంతో జగన్ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
కడప జిల్లాలో YS కుటుంబాన్ని మెజారిటీ ప్రజలు అభిమానిస్తారనేది కాదనలేని సత్యం. అలాంటి కుటుంబంలో రాజకీయ విభేదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. వైఎస్సార్ వారసులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇది ఎంత వరకు వెలుతుందని అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంట్లో సమస్యలను బయటపెట్టుకోవడంతో ప్రత్యర్థులకు చులకనగా కనిపించడం తప్ప మరొకటి లేదని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 11వ తేదీన కడపకు రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. 11వ తేదీ ఉదయం కడపలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలతో పాటు పాల్గొననున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తారని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10న కడప వస్తున్నట్లు వైసీపీ కాంగ్రెస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ కడపలో రోడ్ షో పాటు 7 రోడ్ల వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు.
కూటమి అభ్యర్థుల తరఫున సినీ నటుడు నారా రోహిత్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజంపేటలో రోడ్ షో నిర్వహించనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని రాజంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం కోరారు. ఏర్పాట్లను పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు
రాజంపేట పాత బస్టాండ్ లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ జరగనున్నది. ఈ సభకు జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారి జగన్ రాజంపేటకు రానున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ రాజంపేటలో ప్రచారం చేసి వెళ్లారు.
మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 7 దశాబ్దాల నుంచి ఒక రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే MLAలు కావడం విశేషం. మొదటగా రామారెడ్డి, నారాయణరెడ్డి గెలిచారు. అనంతరం నాగిరెడ్డి రెండు పర్యాయాలు గెలిచారు. డీఎల్ రవీంద్రారెడ్డి 6, శెట్టిపల్లె రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచారు. అయితే ఈసారి TDP కూటమి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారా?
ఉమ్మడి కడప జిల్లా పునర్విభజనలో రాజంపేట నియోజకవర్గం రెండు జిల్లాల్లో భాగమైంది. ఇక్కడ ఒంటిమిట్ట, సిద్దవటం కడప జిల్లాలో కలవగా, నందలూరు, వీరబల్లె, రాజంపేట అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. విశేషం ఏటంటే సిద్దవటం, ఒంటిమిట్ట కడపలో కలిసిన ప్రజలు మాత్రం రాజంపేట నియోజకవర్గంలో ఓట్లు వేస్తారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 సార్లు, TDP 4 సార్లు, YCP 2 సార్లు, సీపీఐ నుంచి ఒకరు, మూడు సార్లు స్వతంత్రులు ఎన్నికయ్యారు.
ఎన్నిక కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 8వ తేదీ (బుధవారం) కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మంగళవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 ఆర్ఓ వద్ద సబ్మిట్ చేసి 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోలేక పోయిన ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఓబులవారిపల్లి మండలం, చిన్నంపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో జబర్దస్త్ సద్దాం టీం కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సద్దాం వెంట పలువురు నటులు ఉన్నారు. కాగా కొందరు సినీ నటులు జనసేనకు మద్దుతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.