India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీలోని 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ అలీ ఖాన్ గుండెపోటుతో గురువారం మద్యాహ్నం మృతిచెందారు. వైసీపీలో కీలక వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ అలీ ఖాన్ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్డు పరిధిలో ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని స్థానికులు చెప్పుకొచ్చారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప MP అభ్యర్థిగా ఎవర్ని నియమించాలని అధిష్ఠానం మల్లగుళ్ళాలు పడుతుంది. రోజుకో కొత్త పేరుతో ఆసక్తి రేపుతోంది. వీరశివారెడ్డి, భూపేశ్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, ఉక్కు ప్రవీణ్, వాసు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు ఐవీఆర్ సర్వే ద్వారా వీరి పేర్లతో ఫోన్లు చేస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబొట్ల సాయినాథ్ శర్మ గురువారం నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైసీపీ నేత వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. సిద్ధం సభలో సీఎం ప్రసంగిస్తూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చెప్పిన మేనిఫెస్టోను 99% నెరవేర్చినట్లు సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పవిత్రమైన గ్రంథంగా భావించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సాధించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు.
త్వరలో రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవీ రెడ్డి ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులో ‘అవినీతి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప జనాలకు ఏమైనా చేశారా… మీ రాక్షస పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడు రోషన్నను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తూ తుది జాబితాను వెలువరించిన నేపథ్యంలో బద్వేలు అభ్యర్థిగా రోషన్నను ఎంపిక చేసింది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరారు.
జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణ రెడ్డికి టికెట్ లభించింది. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలోకి చేరారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూపేశ్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.
పెద్దల నెదిరించారు, పోలీసు కేసులు, ఛేజింగ్ చివరికి ఐదు నెలల క్రితం పుల్లంపేట మండలం దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన హరికృష్ణ, చిట్వేలి కేకే వడ్డిపల్లికి చెందిన శ్రీలేఖ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా గడుపుతున్న ఆ జంటపై విధి కన్నెర్ర చేసింది. రాజంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్సు హరికృష్ణ (21) మృతి చెందగా, శ్రీలేఖ గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన షేక్ భాను(37) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మూడు రోజుల నుంచి తాగు నీటి ట్యాంకర్ రాకపోవడంతో పక్కన వీధిలో నీటి ట్యాంకర్ నుంచి అతి కష్టం మీద బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కోసం ఎక్కువ టెన్షన్ పడడం వల్లే గుండెపోటుకు గురైందని వాపోతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఎర్రగుంట్ల వద్ద రైలు కింద పడి బుధవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సమస్యల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. మృతుడు పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.