India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజంపేట-తిరుపతి జాతీయ రహదారి పైన బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన <<12933916>>విషయం తెలిసిందే.<<>> ఊటుకూరు సమీపంలోని అశోకా గార్డెన్స్ వద్ద లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిట్వేలి మండలం, వడ్డిపల్లెకు చెందిన యువకుడు హరి మృతి చెందగా, శ్రీలేఖ చికిత్స పొందుతుంది. ప్రమాదానికి గురైన వీరికి మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. ఘటనపై పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని టీబి రోడ్డులోని తేజస్విని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మూడో సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న తేజస్వినికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనారోగ్య సమస్యలతోనే తేజస్విని మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కడప జిల్లాలో 513, అన్నమయ్య జిల్లాలో 400 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్ విజయరావు తెలిపారు. అక్కడ ఆర్మూర్ రిజర్వుడ్ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రత్యేక రూటు ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఒక వాహనంతో పాటు ఐదుగురు సిబ్బంది ఉంటారని స్పష్టం చేశారు.
కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.
ఎన్నికల ప్రచార కార్యకలాపాలు చేపట్టాలనుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న లోడు లారీ మంగళవారం బద్వేల్ పట్టణంలోని శేఖర్ థియేటర్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందువైపు టైర్ పగలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. లారీ నెమ్మదిగా రావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాహిల్, జస్వంత్‌ను తిరుపతి హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ గారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు కోడూరులో పదో తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.
రాయచోటిలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారంలో టీడీపీ శాసనసభ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ షాప్ వద్ద ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం, టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.