India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 13వ తేదీన రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలు జరుగుతాయని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, సెక్రటరీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు ఉమ్మడి వైయస్సార్ జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హాజరు కావచ్చని తెలిపారు.
కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన వారికి ఈ నెల 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. జి రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియాలజీ, జువాలజీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తామన్నారు.
కడప నగరంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన కాసుల మనీశ్ అనే కానిస్టేబుల్ గురువారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాల పక్కనున్న బీసీ హాస్టల్ వెనుక బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో బావిలోకి దిగి గాయపడిన మనీశ్ ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది, నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులు, డయేరియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, డీఆర్వో గంగాధర్ గౌడ్‌లతో కలిసి ప్రజారోగ్య భద్రతపై కలెక్టర్ మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖాజీపేట మండలం మిడుతూరులో 19 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని కలెక్టర్ తెలిపారు.
కడప, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వపు డీఐజీ సీహెచ్ విజయ్ రావును రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది కర్నూలు రేంజ్ డీఐజీగా విజయరావు బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కర్నూలు రేంజి డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కడపలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 23 మందికి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించిందని కడప ట్రాఫిక్ సీతారామరెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచామన్నారు. న్యాయస్థానం వారికి జరిమానా విధించింది. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ CI V. సీతారామిరెడ్డి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు కురిసిన వర్షానికి సింహాద్రిపురం మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదయింది. సింహాద్రిపురం మండలంలో 13.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా, యర్రగుంట్లలో 6.8 మి. మీ., కడపలో 6.2 మి.మీ., చింతకొమ్మదిన్నె పరిధిలో 5.4 మి.మీ., ఖాజీపేటలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 64.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 1.8 మి.మీ.,గా నమోదైంది.
జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాయచోటి ప్రాంతీయ వైద్యశాల నందు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
మైలవరం మండలం నార్జంపల్లెలో పెట్రోల్, డీజిల్ ఖనిజాల కోసం ప్రముఖ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ సర్వే చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఈ సంస్థ సర్వే నిర్వహిస్తుంది. నిన్నటితో పెద్దముడియం మండలంలో సర్వే ముగియడంతో నేటి నుంచి మైలవరం మండలంలో ఈ సర్వే ప్రారంభించారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఈ సంస్థ సర్వే చేస్తోంది.
Sorry, no posts matched your criteria.