India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండాపురం మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం ఉదయం ఇన్నోవా, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముద్దనూరు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బైకులో తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్‌లో ప్రయాణిస్తున్న అతని భార్యకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైవీయూ బీఈడీ, ఎంఈడీ 3 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు ఆచార్య వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలలో 84.58 శాతం, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల్లో 85.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.
బద్వేలులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ MLA కమలమ్మ తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప పర్యటనలో ఉన్న చంద్రబాబును గురువారం ఆమె కలిశారు. మరి కొద్దిరోజుల్లో టీడీపీ కండువా కప్పుకుంటారని ఆమె వర్గీయులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతోనే కమలమ్మ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయం మీటింగ్ హాలులో నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
మైదుకూరులో నిన్న సీఎం జగన్ సిద్ధం సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్లాడే కారణంతో ఖాదరపల్లెకు చెందిన యాపరాలపల్లె జాఫర్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు వివరాల మేరకు జాఫర్ మంగళవారం సీఎం జగన్ సభకు హాజరయ్యారు. దీంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ వ్యక్తులు ఫకృద్దిన్, లాల్ బాషాలు మెడపై కత్తి ఉంచి సభకు ఎందుకు వెళ్లావని బెదిరించి కాలు విరిచారని తెలిపారు.
వల్లూరు మండలంలోని గోటూరు గ్రామ పరిధి చెరువులో గుర్తు తెలియని బాలుడి మృతదేహం పడి ఉంది. గురువారం తెల్లవారు జామున బాలుడి మృతదేహాన్ని స్థానికులకు చెరువు నీటిలో నిర్జీవంగా తేలియాడుతూ కనిపించింది. బాలుడి మృతదేహాన్ని బట్టి చూస్తే వయసు ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పింఛను డబ్బు కోసం వెళ్లి వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన రాయచోటిలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు రాయచోటిలోని ఓ బ్యాంకుకు పింఛన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లారు. ఎండకు వెళ్లడంతో వడదెబ్బతో వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
2024 ఎన్నికల నేపథ్యంలో కడప అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కడప జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని కూటమి అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో జిల్లాకు రెండు కంపెనీలు, కడపలో సర్కిల్స్, ఒక మెడికల్ కాలేజ్, ఇలా కడప జిల్లా ముఖచిత్రాన్ని మార్చామంటూ YCP అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో కడప అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొననున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే పీలేరు కూటమి అభ్యర్థిగా కిరణ్ తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి బరిలో ఉండటంతో పీలేరులో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.