India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
టీడీపీ మూడో జాబితాలోనూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కడప, రాజంపేట ఎంపీ స్థానాలు, జమ్మలమడుగు, బద్వేల్, కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ స్థానాల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ మరింత పెరిగుతోంది. ఇక జమ్మలమడుగు, బద్వేల్ స్థానాలు బీజేపీకి.. కోడూరు, రాజంపేట ఎమ్మెల్యే స్థానాలు జనసేన ఇచ్చే అవకాశం ఉందని చర్చలు ఊపందుకున్నాయి.
కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్‌ను కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్‌ను టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.
అబ్బాయి కోసం బాబాయ్ తగ్గినట్లు కనిపిస్తోంది. జమ్మలమడుగు టికెట్ కోసం BJP నుంచి ఆదినారాయణ రెడ్డి, TDP నుంచి భూపేశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరిదీ ఒకే కుటుంబం కావడంతో జమ్మలమడుగు టికెట్ కాకుండా కడప ఎంపీ టికెట్ అడిగినట్లు టాక్. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందో చూడాలి.
ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
మహిళ ఫిర్యాదు మేరకు TDP సీనియర్ నేత మోదుగుల పెంచలయ్యపై కేసు నమోదు చేసినట్లు రాజంపేట పట్టణ CI మద్దయ్య చారి తెలిపారు. వారి వివరాల మేరకు.. రాజంపేటలోని ఉస్మాన్ నగర్లో నివాసం ఉన్న ఒంటరి మహిళ ఇంటి వద్దకు బుధవారం రాత్రి పెంచలయ్య వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, బలవంతం పెట్టాడని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకొని మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సాధారణ ఎన్నికలు -24 కోసం కడప కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ లో ఎన్నికలకు సంబందించిన కార్యకలాపాల పర్యవేక్షణ పకడ్బందీగా జరుగుతోందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ సారథ్యంలో ఎంసీఎంసీ మానిటరింగ్, పర్మిషన్ & ఎన్ఫోర్స్మెంట్ తదితర అంశాలకు సంబంధించిన డెస్కులను ఏర్పాటు చేశామన్నారు.
కడప రైల్వే స్టేషన్ లో ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జాఫర్ అనే వ్యక్తి వద్ద నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కడప రైల్వే ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. రైల్వే స్టేషన్లో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా జాఫర్ అనుమానాస్పదంగా కనిపించాడని తెలిపారు. ఒక్కొక్కటి రెండు కిలోలు చొప్పున నాలుగు కిలోలు గంజాయి బండిల్స్ ఉన్నాయని తెలిపారు. గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవిరెడ్డికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి & రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం మాధవిరెడ్డి సోషల్ మీడియాలో ఎంసీసీని ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్ మాసంలో జరప తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి పట్టాలు పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.