India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ విఫలమై మహేష్ (19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, బి.ఎర్రగుడి గ్రామం, కాపుపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు హుటాహుటిన లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈనెల 18వ తేదీన పులివెందులలోని నగిరిగుట్టలో జరిగిన రెంటాల బాబు హత్య కేసులో ముద్దాయి రెంటాల సురేశ్‌ను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. రెంటాల అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. కూర వేయలేదనే కారణంతో బాబుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని వివరించారు.
సార్వత్రిక పరీక్షలు అక్రమాలకు పాల్పడిన జమ్మలమడుగు జిల్లా పరిషత్ బాలిక పాఠశాల కేంద్రంలో 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈఓ అనురాధ తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తొలగించినట్లు చెప్పారు. కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. బుధవారం జరిగిన పదో తరగతి ఆంగ్ల పరీక్షకు 2138 మందికి 1947 మంది హాజరయినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి <<12893521>>వరదరాజుల రెడ్డి<<>>పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మంగళవారం 38వ వార్డులో, 22వ వార్డులో వరదరాజుల రెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ప్రొద్దుటూరు 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఇంటిలో బుధవారం వరదరాజుల రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కౌన్సిలర్ వైఎస్ మహమూద్ గౌస్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 27న కడప జిల్లాలో జరగనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రూట్ మ్యాప్‌లో రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జేసీ గణేశ్ కుమార్, కడప కమిషనర్ ప్రవీణ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా ప్రచారం చేయాలన్నా కూడా అనుమతులు తప్పనిసరన్నారు. సభలు సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.
Sorry, no posts matched your criteria.