Y.S.R. Cuddapah

News April 26, 2024

కమలాపురం: విద్యుదాఘతంతో వ్యక్తి మృతి

image

విద్యుత్‌ షాక్‌‌తో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పెద్ద చెప్పలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దచెప్పలిలోని పంచర్ బంకుకు విద్యుత్ సరఫరా కావడంతో అన్వర్ భాష(36) షాక్‌ తగిలి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

image

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.

News April 26, 2024

మరోసారి కడప జిల్లాకు సీఎం జగన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీ మైదుకూరులో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కాగా గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనకు YCP శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగన్ సొంత ఇలాఖాలో మరోసారి పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

News April 26, 2024

కడప: వివాహిత అనుమానాస్పద మృతి

image

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.

News April 25, 2024

మైదుకూరు: గుండెపోటుతో ఉపాధి కూలి మ‌ృతి

image

మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లెలో గురువారం ఉపాధి కూలి గవ్వల పెద్దబాలుడు (62)ఎండ తీవ్రతతో అస్వస్థకు గురై మృతి చెందాడు. పెద్ద బాలుడు ఉపాధి పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడని కూలీలు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి ఏపీఓ రామచంద్రారెడ్డి పరామర్శించారు.

News April 25, 2024

రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

News April 25, 2024

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. తప్పిన ప్రమాదం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 25, 2024

కడప: రూ.11.41 కోట్ల మద్యం, నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా 44 రోజుల నుంచి చేస్తున్న తనిఖీల్లో రూ.11.41 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులు, నగదును అధికారులు సీజ్ చేసినట్లు కలెక్టరు తెలిపారు. అందులో మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తుసామగ్రి రూ.7.64 కోట్ల విలువైన వస్తు సామగ్రిని వివిధ విభాగాల తనిఖీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.50 వేలకు పైబడి తీసుకెళుతున్న రూ.3,76,96,225 నగదును సీజ్ చేశామన్నారు.

News April 25, 2024

అవినాశ్ మంచివాడు కాబట్టే టికెట్ ఇచ్చాను: జగన్

image

వైఎస్ అవినాశ్ రెడ్డి మంచివాడు, తప్పు చేయలేదనే నమ్మకం ఉంది కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినాశ్ మా అందరికంటే చిన్న పిల్లవాడని అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి అవినాశ్‌పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అవినాశ్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ ఒకరోజు పర్యటనలో భాగంగా కడప జిల్లా చేరుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన గన్నవరం నుంచి విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం తన నామినేషన్ ను అందజేయనున్నారు.