Y.S.R. Cuddapah

News June 9, 2024

అన్నమయ్య: ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమికుల మృతి

image

బత్తలపల్లి అడవిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు మృతిచెందినట్లు ములకలచెరువు SI తిప్పేస్వామి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25), ఎద్దులవారిపల్లెకు చెందిన రాణి(17) ప్రేమించుకున్నారు. కులాలు వేరని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు శుక్రవారం పురుగు మందు తాగగా, ఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.

News June 9, 2024

కడప జిల్లా నేతల్లో మంత్రి పదవి ఎవరికి.?

image

ఉమ్మడి కడప జిల్లా నుంచి పది స్థానాల్లో ఏడింటిని కూటమి సొంతం చేసుకుంది. ఇక అనకాపల్లి, ఏలూరు ఎంపీలుగా సీఎం రమేశ్, పుట్టా మహేశ్ యాదవ్ గెలిచారు. ధర్మవరం ఎమ్మెల్యేగా జిల్లా వాసి సత్య కుమార్ గెలిచారు. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గంలో మన వారి పేర్లే వినపడుతున్నాయి. దీంతో జిల్లా నుంచి ఎవరికి కేంద్ర, రాష్ట్ర పదవులు వస్తాయో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు నేతలు అధిష్ఠానాలతో మంతనాలు సాగిస్తున్నారు.

News June 9, 2024

కడప: రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు

image

ఎన్నికల సమయంలో కడప ఎక్సైజ్ డివిజన్ పరిధిలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప డివిజన్ పరిధిలో 40 ప్రభుత్వ దుకాణాలు, 14 బార్లు ఉన్నాయి. వాటి నిర్వాహకులు మేలో ఎక్సైజ్ డిపో నుంచి రూ.34.56 కోట్ల విలువ చేసే మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించారని ఎక్సైజ్ డిపో మేనేజర్ ధనుంజయకుమార్ తెలిపారు.

News June 9, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ఆలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ ఆలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం ఆలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి పేరు తెస్తానన్నారు. 

News June 8, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ అలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం అలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి తెస్తానన్నారు. 

News June 8, 2024

కడప-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం

image

రైల్వే కోడూరు మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవరంలోని పోడు హరిజనవాడ సమీపంలో కడప-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ ఓ వ్యానును బలంగా ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో డ్రైవర్లు ఊపిరి తీసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

ఏడీ సెట్-24 రద్దు: వైఎస్ఆర్‌ఏఎఫ్ యూలో నేరుగా ప్రవేశాలు

image

కడప నగర పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఏడీసెట్-2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేసినట్లు ఏడీసెట్ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 8, 2024

2024 ఎన్నికల్లో మారిన రాజంపేట సెంటిమెంట్

image

4 దశాబ్దాలుగా రాజంపేటలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వస్తోంది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం సాధించగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి అమర్ నాథ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆకేపాటి ప్రతిపక్షానికి పరిమితం అవుతున్నారు.

News June 8, 2024

టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి?

image

కడప ఎంపీ స్థానానికి కూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. దీంతో టీడీపీ బోర్డు ఛైర్మన్‌కు భూపేశ్ అర్హుడని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీనిపై భూపేశ్ స్పందన తెలియాల్సి ఉంది.

News June 8, 2024

కడప: ఒకే ఒక్క ఎమ్మెల్యే

image

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో YCP గెలిచిన 11 స్థానాల్లో బద్వేల్ MLA దాసరి సుధ ఓ రికార్డు నమోదుచేశారు. YCP నుంచి గెలిచిన ఒకే ఒక్క మహిళా MLAగా నిలిచారు. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఏకైక మహిళా MLAగా కూడా నిలిచారు. అయితే 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో 90,533 భారీ మెజార్టీతో గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 18,567 మెజార్టీ ఓట్లకు తగ్గిపోయారు.